అయేషా ఫాదర్ కి తాప్సీ స్ట్రాంగ్ కౌంటర్

Update: 2017-01-03 15:30 GMT
సమాజ్ వాదీ పార్టీ నేత.. మాజీ నటి అయేషా టకియా తండ్రి అయిన అబు ఆజ్మి వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. మహిళలను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రవిమర్శలకు గురవుతున్నాయి. 'మహిళలు పెట్రోల్.. పంచదారలాంటి వాళ్లు.. పెట్రోల్ ఉంటే మంట ఉంటుంది.. పంచదార ఉంటే చీమలు' వస్తాయ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దుమారం రేపుతున్నాయి.

దీనిపై చాలామంది బాలీవుడ్ నటులు స్పందించగా.. ఇప్పుడు పింక్ బ్యూటీ తాప్సీ పన్ను తనదైన స్టైల్ లో రెచ్చిపోయి విమర్శలు గుప్పించింది. మహిళలపై ఆయన చూపిన చిన్నచూపును తీవ్రంగా విమర్శించిన ఆమె.. ఆ రాజకీయ నాయకుడు చేసిన కామెంట్స్ ను ఖండించింది. 'పింక్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కి ఆయన్ని పిలవాలని అనుకుంటున్నా. లేదా పింక్ చిత్రం కోసం ఓ టికెట్ కొని ఆయనకు పంపాలని అనుకుంటున్నా' అని చెప్పింది తాప్సీ.

భర్త.. సోదరులలో ఎవరో ఒకరు తోడు లేకుండా మహిళలు రాత్రి పూట పార్టీలు చేసుకోవడం తప్పు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ దుమారానికి కారణం. బాధితులను కాకుండా.. నేరం చేసినవాళ్లపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించడంటూ.. అబు ఆజ్మీకి సూచనలు అందుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News