ఆయిల్ రాస్తున్న తాప్సీ

Update: 2015-12-09 09:30 GMT
తాప్సీ పన్నూ ఇప్పుడు బాగా బిజీ అయిపోయింది. కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్లడానికి చాలానే కష్ట పడింది తాప్సీ. వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డా.. ఈ ఏడాది వచ్చిన తమిళ చిత్రం గంగ(తమిళ్ లో కాంచన2) ఈ భామ స్టేటస్ ను అమాంతం పెంచేసింది. కోలీవుడ్ - బాలీవుడ్ లోనే కాదు.. మిగిలిన ఇండస్ట్రీల నుంచి బోలెడన్ని ఆఫర్స్ ఇప్పుడీ ఢిల్లీ సుందరిని పలకరిస్తున్నాయి. బ్రాండ్ ఎండార్స్ మెంట్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడం విశేషం.

రీసెంట్ గా నిర్మల్ అనే బ్రాండ్ హెయిర్ ఆయిల్ కి తాప్సీ ప్రచారకర్తగా ఎంపికైంది. గతంలో తన దగ్గరకు చాలానే హెయిర్ ఆయిల్ కంపెనీలు వచ్చినా వాటిని అంగీకరించలేదని.. క్వాలిటీ ఉన్న ఉత్పత్తులకే ప్రచారం చేస్తానంటోందీ సుందరి. నాణ్యత విషయంలో రాజీ పడబోనని, తను ప్రచారం చేసిందంటే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుందని ప్రజలు అనుకోవాలన్నదే తన లక్ష్యంగా చెప్తోంది. అంతే కాదు.. ఈ నిర్మల్ పేరుతో ఈమెకు మరో అనుబంధం కూడా ఉంది. తాప్సీ తల్లి పేరు నిర్మల్ జీత్ పన్నూ. అలా తన తల్లి పేరు కూడా కలిసి రావడం, అదే పేరుతో ఉన్న బ్రాండ్ కు యాడ్స్ ఇస్తుండడం.. డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అంటోంది.

అసలు తనకు క్రేజ్ రావడంలో.. తన హెయిర్ కూడా ఓ కారణమట. కాలేజ్ రోజుల నుంచి తాప్సీ కర్లీ హెయిర్ చాలా అందంగా ఉంటుందని.. బోలెడు మంది పొగిడేసే వారట తోటి వాళ్లు. మొత్తానికి కెరీర్ ని గాడిలో పెట్టుకోవడమే కాదు.. కొత్త ఆఫర్స్ కూడా బాగానే వస్తుండడంతో.. భలే ఖుషీగా కనిపిస్తోంది 28 ఏళ్ల ఢిల్లీ సుందరి తాప్సీ.
Tags:    

Similar News