ఆ హీరో వ‌ల్లే ట‌బూకి పెళ్లి కాలేద‌ట‌

Update: 2017-06-29 08:01 GMT
వ‌య‌సు మీద ప‌డుతున్నా అలాంటి ఛాయ‌లు క‌నిపించ‌కుండా ఉండే న‌టీమ‌ణులు కొంద‌రు మాత్ర‌మే ఉంటారు. అయితే.. వ‌య‌సు తెలుస్తున్నా.. అందం అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టం కొంద‌రికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. హీరోయిన్ అన్న వెంట‌నే అందాల ప్ర‌ద‌ర్శ‌న మాత్ర‌మే కాదు.. అంత‌కు మించి అన్న‌ట్లుగా అనిపించే స‌త్తా ఉండే ముద్దుగుమ్మ‌లు త‌క్కువే. అలాంటి రేర్ పీస్ ట‌బు.

విల‌క్ష‌ణ‌మైన అందం.. అంత‌కు మించిన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకుంటోంది. మీద ప‌డే వ‌య‌సు కాస్త క‌నిపించినా.. ఆమెలో ఛార్మ్ మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. తాజాగా ఆమె చేసిన స‌ర‌దా వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా చేస్తున్న గోల్ మాల్ ఎగైన్‌ లో న‌టిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంద‌ర్భంగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యానికి సంబంధించి ఆస‌క్తిక‌ర కోణాన్ని బ‌య‌ట‌కు చెప్పుకొచ్చారు.

ఫార్టీ ఎప్పుడో క్రాస్ అయినప్ప‌టికీ ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేద‌న్న క్వ‌శ్చ‌న్‌ కు.. అజ‌య్ దేవ‌గ‌ణే కార‌ణం అంటూ స‌ర‌దాగా బదులిచ్చింది. ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌రిగిన దానిని చెప్పుకొచ్చింది. అజ‌య్ త‌న‌కు పాతికేళ్లుగా తెలుస‌ని.. త‌న క‌జిన్ స‌మీర్ ఇంటి ప‌క్క‌నే అజ‌య్ ఉండేవాడ‌ని చెప్పింది. త‌న‌ను త‌న క‌జిన్‌.. అజ‌య్ లు ఓ కంట క‌నిపెట్ట‌ట‌మే కాదు.. త‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రొచ్చిన ఊరుకునే వారు కాద‌ని వెల్ల‌డించింది.

అబ్బాయిలు త‌న‌ను చూసినా.. మాట్లాడే ప్ర‌య‌త్నం చేసినా కొడ‌తామ‌ని బెదిరించేవార‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న‌కు పెళ్లి కాలేదంటే అజ‌యే కార‌ణం అంటూ న‌వ్వుతూ చెప్పేసింది. త‌న‌కు మంచి స్నేహితుడంటూ అజ‌య్ కు కాంప్లిమెంట్ ఇచ్చేసిన ట‌బు మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News