యంగ్ హీరోకు టబు స్వీట్ వార్నింగ్

Update: 2021-12-22 00:30 GMT
బాలీవుడ్ యంగ్ హీరోకు సీనియ‌ర్ న‌టి టబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇప్పుడు నెట్టంట వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. `బాహుబ‌లి` త‌రువాత టాలీవుడ్ సినిమాల‌పై బాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక్క‌డ ఏ సినిమా హిట్ అనిపించుకున్నా దాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేస్తున్నారు. అక్క‌డ కూడా మ‌న చిత్రాలు భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో మ‌న సినిమాలంటే బాలీవుడ్ మేక‌ర్స్ లో మ‌రింత పోటీ ఏర్ప‌డింది.

ప్ర‌స్తుతం తెలుగులో సూప‌ర్ డూఐప‌ర్ హిట్ లుగా నిలిచిన చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ముందు వ‌రుస‌లో నిలిచిన చిత్రం `జెర్సీ`. నాని నటించిన ఈ చిత్రాన్ని హిందీలో షాహీద్ క‌పూర్ హీరోగా అదే పేరుతో అల్లు అర‌వింద్, దిల్ రాజు, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, అమ‌న్ గిల్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ మూవీ ఈ ఏడాది ఎండింగ్‌లో ప్రేక్ష‌కుల ముదుకు రాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా జ‌రుగుతున్నాయి.

ఇదిలా వుంటే తెలుగులో ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచిన `అల వైకుంఠ‌పుర‌ములో` కూడా హిందీలో రీమేక్ అవుతోంది. బ‌న్నీ న‌టించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించ‌గా టబు, జ‌య‌రామ్, సుశాంత్ , నివేదా పేతురాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, స‌ముద్ర‌ఖ‌ని, స‌చిన్ ఖేడేక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బ‌న్నీ కెరీర్ లోనే తొలి ఇండ‌స్ట్రీ హిట్ గా రికార్డు సాధించిన ఈ చిత్రం హిందీలో `షామ్‌జాదా` పేరుతో రీమేక్ అవుతోంది. ఇందులో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తున్నాడు.

కృతి స‌న‌న్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రోహిత్ ధావ‌న్ రూపొందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రోహిత్ ధావ‌న్ తో వున్న ఓ ఫొటోని సోష‌ల్ మీడియా వేదిక‌గా కార్తీక్ ఆర్య‌న్ అభిమానులతో పంచుకున్నారు.

అంతే కాకుండా ఈ ఫొటోకు `రోహిత్ తో క‌లిసి ప‌నిచేయ‌డం బాగుంద‌ని` క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఇది గ‌మ‌నించిన టబు యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినంత‌ప‌ని చేసింది. `అది ఎంతో మంచి సినిమా జాగ్ర‌త్త‌గా రీమేక్ చేయాలి`అని కామెంట్ చేసింది. దానికి కార్తీక్ `మీ సినిమా కాబ‌ట్టే ఎక్కువ ప్రేమ‌తో చేస్తున్నామ‌ని రిప్లై ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది.
Tags:    

Similar News