తెలుగు సినిమా పరిచయమైన ప్రతిఒక్కరికి సుపరిచితమైన పేరు ఠాగూర్ మధు. హీరోలు.. హీరోయిన్లు.. దర్శకులకు స్టార్ ఇమేజ్ ఉండటం.. సెలబ్రిటీ స్టేటస్ ఉండటం మామూలే. ఇవాల్టి రోజున ఇమేజ్ ఉన్న నిర్మాతలకు కొద్దిమందే. అలాంటి వారిలో ఒకరు ఠాగూర్ మధు. చిరు కెరీర్ లో మర్చిపోలేని సినిమాను అందించటమేకాదు.. బ్లాక్ బాస్టర్ మూవీని నిర్మించిన ఆయనదే గజనీ కూడా.
ఇటీవల మహేశ్ తో నిర్మించిన స్పైడర్ మూవీ.. భారీ దెబ్బేయటం మినహాయిస్తే.. ఠాగూర్ మధు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్ని వంక పెట్టాల్సిన పని లేదు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పే ఆయన.. తాజాగా ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు.
ప్రస్తుతం రాజకీయ వేడి రెండు రాష్ట్రాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. హాట్ హాట్ గా మారిన వేళ.. కొందరు మెగాస్టార్ చిరును ఉద్దేశించి చేస్తున్న విమర్శలపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. ఏపీకి చెందిన నేతల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫు వాళ్లు బెదిరిస్తున్నట్లుగా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించటమే కాదు.. పలువురు పవన్ మీద ఎదురుదాడి మొదలెట్టారు.
ఇందులో భాగంగా పవన్ సోదరుడు కమ్ మెగాస్టార్ చిరంజీవిపైనా విమర్శలు చేయటం షురూ చేశారు. దీనిపై స్పందించిన ఠాగూర్ మధు.. రాజకీయాల్లోకి చిరు పేరును లాగటం ఏ మాత్రం సరైంది కాదన్నారు. జీవితాన్ని.. వృత్తిని క్రమశిక్షణతో వ్యవహరించే ఆయన్ను ఉద్దేశించి విమర్శలు చేయటం సరికాదన్నారు. అంతే కాదు.. ఇప్పుడు నడుస్తున్న వాడీవేడి చర్చల్లో కేసీఆర్ ప్రస్తావన తీసుకురావటం సరికాదంటూ వ్యాఖ్యలు చేశారు. చిరు.. కేసీఆర్ లను ఉద్దేశిస్తూ ఠాగూర్ మధు చేసిన వ్యాఖ్యలు పవన్ కు పంచ్ లుగా మారుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధు ట్వీట్స్ ను ప్రాతిపదికగా తీసుకుంటే నిత్యం.. కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్న పవన్ తీరును తప్పు పట్టాల్సిందేగా?