క్యాన్సర్ మహమ్మారీ భారిన పడినా.. ఎందరో సెలబ్రిటీలు మొక్కవోని ధీక్షతో ట్రీట్‌మెంట్ తీసుకుని మృత్యుంజయులుగా తిరిగొచ్చారు. ఈ జాబితాలో మనీషా కొయిలారా - సోనాలి బింద్రే, మమతా మహన్ దాస్ వంటి కథానాయికలు ఉన్నారు. వీళ్లంతా క్యాన్సర్ ని ధైర్యంగానే ఎదిరించారు. అయితే అలా పోరాటానికి సిద్ధమయ్యే ముందుగా ఎంతో ప్రిపరేషన్ అవసరమని సోనాలి బింద్రే నేడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
క్యాన్సర్ అన్న పదం వినగానే, చావు ముంచుకొచ్చేస్తోందని భయపెట్టేస్తుంటారు. కానీ ఆ ఎమోషన్ ని మించి క్యాన్సర్ గురించి ఇంకా తెలుసుకోవాల్సినది ఉంది. `సీ` అనే పదం వినగానే భయపడొద్దు. ముందు దాని గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి .. సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, తాను చేసింది అదేనని అన్నారు సోనాలి బింద్రే. నేడు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సోనాలి బింద్రే ఓ చక్కని సందేశంతో కూడుకున్న లేఖను రాశారు. ప్రస్తుతం ఆ లేఖ నెటిజనుల్లో వైరల్ అవుతోంది.
కొన్ని నెలల క్రితం యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్యామణి తాహిర కశ్యప్ క్యాన్సర్ తో బాధపడుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్యాన్సర్ జీరో దశ అని ట్వీట్ చేశారు. తన భర్త సాయంతో క్యాన్సర్ ని ఎదురొడ్డి చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తాహిర ఓ బోల్డ్ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కీమో థెరపీకి ముందు బాల్డ్ హెడ్.. కనిపిస్తోంది ఈ ఫోటోలో. అలాగే తన వెనక భాగం ఏ ఆచ్ఛాధన లేకుండా ఉంది. కుడివైపు వీపుకు దిగువగా కత్తితో కోసినట్టుగా కనిపిస్తోంది. బహుశా క్యాన్సర్ సందర్భంగా వైద్యులు చికిత్స చేసిన ప్రదేశం అది అని అర్థమవుతోంది. ``ఈరోజు నాది. నాకు తెలిసినవన్నీ చెప్పడా నా బాధ్యత`` అంటూ తాహిర ఓ సుదీర్ఘమైన లేఖను ట్వీట్ చేశారు. ఇలాంటి బోల్డ్ ఫోటోని షేర్ చేయాలనుకోవడం పూర్తిగా తన నిర్ణయమేనని అన్నారు తాహిర. నిన్ను నువ్వు నమ్మితే చాలు ఎంతటి యుద్ధాన్ని అయినా గెలుస్తావు! అంటూ స్ఫూర్తి వంతమైన మాటను తాహిర అన్నారు.