ఈమద్య కాలంలో ఎక్కువ మంది సెలబ్రెటీలు క్యాన్సర్ బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ తో పోరాడుతోంది. గత కొన్ని నెలలుగా ఆమె అమెరికాలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న విషయం తెల్సిందే. తాజాగా మరో సెలబ్రెటీ కూడా తనకు క్యాన్సర్ అంటూ ప్రకటించింది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ తనకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉందని ప్రకటించింది.
సోషల్ మీడియాలో ఈ విషయమై సుదీర్ఘ పోస్ట్ చేసింది. అందులో తహీరా కశ్యప్.. ఇది నాకు చాలా కఠినమైన సమయం, అయినా నేను ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. మొదటి సారి టెస్టు చేయించుకున్న సమయంలో క్యాన్సర్ స్టేజ్ జీరోలో ఉందని అన్నారు. జాగ్రత్తలు తీసుకుంటే అదుపు చేసుకోవచ్చని సూచించారు. కాని ఈ మహమ్మారి ముదిరి పోయింది. స్టేజ్ వన్ కు చేరింది. అయినా కూడా ధైర్యం కోల్పోనని ఆయుష్మాన్ మరియు నా స్నేహితులకు మాట ఇస్తున్నాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పటికే ఆరు సెషన్స్ పూర్తి అయ్యాయి అంటూ పోస్ట్ చేసింది.
మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుని విక్కీ డోనర్ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్ ఖరానా ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో బిజీ హీరోగా ఉన్నాడు. వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్న ఆయుష్మాన్ 2011వ ఏడాదిలో తహీరాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో ఇలా షాకింగ్ పరిణామాలు చోటు చేసుకోవడంతో ఆయుష్మాన్ సన్నిహితులు మరియు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహీరా ఆరోగ్యం బాగుండాలని అంతా కోరుకుంటున్నారు.