నాగచైతన్యతో మళ్ళీ రిస్క్ చేస్తున్నారా?

Update: 2022-11-12 02:30 GMT
అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అతను పూర్తిస్థాయిలో ఇంకా పట్టు సాధించలేదు అనే చెప్పాలి. ప్రతిసారి కూడా అతను సక్సెస్ కోసం ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తోంది. అతని కెరీర్ మొదటి నుంచి చూసుకుంటే కూడా సక్సెస్ అయిన సినిమాలో అన్ని కూడా కాంబినేషన్స్ తరహాలో హిట్ అయినవి. లేదంటే టైం కలిసి రావాల్సిందే.

మజిలీ సినిమా అలాగే వెంకీ మామ ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా కాంబినేషన్ ట్రాక్ లోనే సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాకు శేఖర్ కమ్ముల సాయి పల్లవి కాంబో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా వచ్చిన థాంక్యూ సినిమా నాగచైతన్య కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజు కూడా ఆ సినిమా పై పూర్తిస్థాయిలో నమ్మకంగా లేనట్లు విడుదలకు ముందే అర్థమైంది.

ఒక విధంగా దిల్ రాజుకు ఈ ఏడాది అదే అతిపెద్ద లాస్ అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు నాగచైతన్య తదుపరి సినిమాపై మళ్ళీ నిర్మాతలను గట్టిగానే ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో నిర్మాత సుధాకర్ చెరుకురి నాగచైతన్య 22వ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసింది. తమిళ దర్శకుడు వెంకట ప్రభు ఈ సినిమాను తెలుగు తమిళ్ ఒకేసారి తెరపైకి తీసుకొస్తున్నారు.

ఈ సినిమా కోసం 25 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అరవింద్ స్వామిని కూడా తీసుకువచ్చారు. కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే ఏడు నుంచి 10 కోట్ల వరకు ఖర్చ పెడుతున్నారట. అసలే ఈ నిర్మాత ఇంతకుముందు రామారావు ఆన్ డ్యూటీ, ది వారియర్, విరటపర్వం సినిమాలతో దెబ్బ తిన్నాడు.

ఇక ఇప్పుడు చైతూ పై పెద్ద రిస్క్ చేస్తున్నాడు అని అనిపిస్తోంది. దానికి తోడు నాగచైతన్యకు ఇంతవరకు పెద్దగా అచ్చిరాని మాస్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కంటెంట్ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News