తళా అజిత్ కుమార్ నటించిన వలీమై రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా ఓమిక్రాన్ ప్రభావంతో వాయిదా వేసుకోవాల్సిన సన్నివేశం ఎదురైంది. వైరస్ భయాలు అంతకంతకు దేశాన్ని ఒణికిస్తున్నాయి. మెట్రో నగరాల్లో ఉధృతి పెరుగుతోంది. ఓమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో అన్నిచోట్లా షట్ డౌన్ లు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా వినోదరంగానికి ఇది పెను విఘాతంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో థియేటర్లను మూయించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలతో పాటు థియేటర్ల బంద్ పాటిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాలున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. దీంతో ఈ సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన అజిత్ వలీమై విడుదల వాయిదా పడింది.
వలీమై తమిళంతో పాటు తెలుగులోనూ అత్యంత భారీగా విడుదల కావాల్సి ఉండగా ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. అజిత్ అభిమానులు ఇప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వలీమై టీజర్ ట్రైలర్ సహా ప్రతిదీ ఉత్కంఠను పెంచాయి. తళా అజిత్ - కార్తికేయ ఒకరితో ఒకరు పోటీపడి నటించారని ట్రైలర్ తో అర్థమైంది. అదే క్రమంలో ఈ మూవీ రాక కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూశారు. వలీమైని బోనీకపూర్ నిర్మించారు.
తెలుగు టైటిల్ లేదేమిటి?
నిజానికి వలీమై కి తెలుగు టైటిల్ ని ఫిక్స్ చేయకుండానే పోస్టర్ వేయడం నిరాశపరిచింది. ఇంతకుముందు వలీమైకి సరిపోయేలా బలం అనే టైటిల్ ని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ టైటిల్ కనిపించలేదు. వలీమై పేరుతోనే తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు పంపిణీ వర్గాలు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. బలం టైటిల్ అంత ఆసక్తిగా లేకపోవడమే దీనికి కారణమా అన్నది టీమ్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి జనవరి 13న రావాల్సిన సినిమా రిలీజ్ వాయిదా పడడం తీవ్రంగా నిరాశపరుస్తోంది.

Yesss… experience #Valimai in Telugu & hindi tooo..Be ready for the full-on promotional content heading ur way from today