లాక్ డౌన్ కారణంగా దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ఎంటర్ టైన్ చేయడానికి టెలివిజన్ ప్రోగ్రాములు - డైలీ సీరియళ్ల షూటింగ్ లకు అనుమతులు కావాలని పలు చానళ్ళ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మాసాబ్ ట్యాంక్ లోని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలు ఎంటర్ టైన్ మెంట్ టీవీ ఛానళ్ళ ప్రొగ్రామింగ్ హెడ్స్ కలిశారు. వారిలో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ - ఈటీవీ సీఈఓ బాపినీడు - జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ - జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే.సుబ్రహ్మణ్యం - తెలుగు టీవీ ప్రొడ్యూర్స్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లాక్ డౌన్ వలన ఇంటి వద్దే ఉంటున్న ప్రజలకు టీవీ ఒక్కటే వినోద సాధనమని - టీవీ ప్రోగ్రాములు - సీరియళ్ల షూటింగులు గత 45 రోజులుగా నిలిచిపోవడంతో పాత ప్రోగ్రాములనే రిపీట్ చేయాల్సి వస్తుందని మంత్రి తలసానికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా మంత్రికి అందించడం జరిగింది. టివి ప్రోగ్రాముల షూటింగ్ లకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్ లను నిర్వహిస్తామని మంత్రికి విన్నవించారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ వలన ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. వారిని ఎంటర్ టైన్ చేయడానికి షూటింగ్ ల నిర్వహణకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ విషయం పై స్పందించిన మంత్రి తలసాని.. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి అద్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశం పై పరిశీలిస్తామని చెప్పి సెలవిచ్చారు.