సారీ.. గాళ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలామంది చెబుతుంటారు. అయితే ఒక మాజీ గాళ్ ఫ్రెండ్ ఇలా ఉండాలి అని ఎవరైనా చెబుతారా? చెప్పరు. ఎందుకంటే ఒక్కసారి బ్రేకప్ అయ్యాక.. అమ్మాయి అయినా అబ్బాయి అయినా తమ మాజీల గురించి నానా రచ్చ చేసేస్తూ ఉంటారు. కాకపోతే మాజీలు ఎలా ఉండాలో చేతల్లో చూపించింది బ్రటీష్ ఇండియన్ గాళ్ కత్రినా కైఫ్.
రణబీర్ కపూర్ అంటే బాలీవుడ్ లో ఒక కసానోవా టైపు. మనోడు అప్పట్లో బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లతో డేటింగ్ వగైరా చేశాడు. ముందుగా సోనమ్ కపూర్ తో తిరిగాడు. ఆ తరువాత దీపిక పదుకొనెతో కలసి సినిమా చేస్తున్నప్పుడు సోనమ్ తో బ్రేకప్ అయ్యి.. దీపికను పటాయించాడు. ఇకపోతే కత్రినా కైఫ్ తో సినిమా చేస్తున్నప్పుడు.. దీపికకు హ్యండిచ్చి ఆమెను తగులుకున్నాడు. ఇక అప్పటికే అటు సోనమ్ - దీపికలకు కూడా ఓ ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్ లతో బ్రేకప్ లు వగైరా అయ్యాయ్ లే. కట్ చేస్తే కత్రినా కూడా అప్పటికే సల్మాన్ ఖాన్ ను బాగా డేటింగ్ చేసి దాదాపు అతగాడి భార్యగా ఊరందరితో కామెంట్లు చేయించుకున్నాక కూడా బ్రేకప్ చేసుకుంది. ఎప్పుడన్నా మాజీ ప్రియుడు రణబీర్ గురించి అడిగితే.. సోనమ్ అయినా దీపిక అయినా.. తెగ కామెంట్లు చేస్తుంటారు. మనోడ్ని బీభత్సంగా కామెడీ చేస్తుంటారు. కాఫీ విత్ కరణ్ టైపు షోలలో ఎంతో అల్లరి చేసి అతగాడి పరువు కూడా తీశారు.
కాని కత్రినా కైఫ్ అలా కాదు. అమ్మడిని సల్మాన్ గురించి చెప్పు.. ఎందుకు బ్రేకప్ అయ్యావో చెప్పు అంటూ నిన్ననే ఒక టివి షో లో అడిగితే.. ''నేను కలసి ఉన్నప్పుడు సల్మాన్ తో అంతా హ్యాపీగానే ఉంది. అయితే ఇప్పుడు నేను సల్మాన్ తో ఎందుకు బ్రేకప్ అయ్యానో చెప్పడం వలన నా ప్రెజంట్ బాయ్ ఫ్రెండ్ ను అవమానించినట్లవుతుంది. దానికి తోడు సల్మాన్ ఫ్యామిలీ గురించి చెప్పడం.. అదంతా మంచి పద్దతి కాదు. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా..'' అంటూ సెలవిచ్చింది. అబ్బా.. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఒక్క కామెంట్ అంటే ఒక్కటి కూడా చేయలేదు. మరి ఐడియల్ మాజీ గాళ్ ఫ్రెండ్ అంటే ఇలాగే ఉండాలేమో. ఏమంటారు అబ్బాయిలూ??