#ప్రభాస్‌21 : కీరవాణితో కాదు ఆస్కార్‌ విన్నర్‌ తో చర్చలు

Update: 2020-08-02 11:50 GMT
ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ ల కాంబో మూవీపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ చిత్రంలో హీరోయిన్‌ గా దీపిక పదుకునే నటించబోతుంది. పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భారీ బడ్జెట్‌ ను ఖర్చు చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులను ఈ చిత్రం కోసం పని చేయిస్తున్నాడట. అంతర్జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్న పలువురు టెక్నీషియన్స్‌ ప్రభాస్‌ 21 సినిమా కోసం వర్క్‌ చేయబోతున్నారు. ఇక సంగీత దర్శకుడి విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం బాహుబలి చిత్రంకు సంగీతంను అందించడంతో పాటు ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో నాగ్‌ అశ్విన్‌ ఉన్నాడని.. ఆయన నుండి మంచి సంగీతాన్ని రాబట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కీరవాణితో చర్చలు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు కీరవాణితో కాదు ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రహ్మాన్‌ తో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

ఈమద్య కాలంలో పూర్తిగా బాలీవుడ్‌ కే పరిమితం అయిన ఏఆర్‌ రహ్మాన్‌ ను ఈ చిత్రం కోసం సంప్రదించడం జరిగిందని ఆయన నాలుగు కోట్ల పారితోషికంను డిమాండ్‌ చేసినట్లుగా కూడా టాక్‌. ఇతర సంగీత దర్శకులతో పోల్చితే ఈ మొత్తం కోటి నుండి కోటిన్నర వరకు ఎక్కువే అయినా రహ్మాన్‌ ఈ ప్రాజెక్ట్‌ ఎంట్రీతో మరింత క్రేజ్‌ దక్కుతుందనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారట. ప్రస్తుతం పారితోషికం విషయంలో చర్చలు జరుపుతున్న మేకర్స్‌ త్వరలోనే కన్ఫర్మ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News