తెలుగు ప్రజల్ని అమితంగా ప్రభావితం చేసే అంశాలు రెండు. ఒకటి.. రాజకీయం.. రెండోది సినిమా. ఈ రెండు కాకుండా క్రికెట్ కూడా ఉన్నప్పటికీ.. మొదటి రెండింటిని తీసుకునేంత పర్సనల్ గా క్రికెట్ ను తీసుకోరనే చెప్పాలి.
అంతటి ప్రభావిత రంగాల్లో పని చేసే వారి మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రంగానికి సంబంధించి.. ప్రతిభ ఎంత ఉన్నా.. తుది ఫలితం చాలా ముఖ్యం. సక్సెస్ లేకుంటే ఎంత టాలెంట్ ఉన్నా ప్రయోజనం ఉండదు. ఈ రంగాల్లో సెంటిమెంట్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటికి ఇచ్చే ప్రాధాన్యత కూడా ఎక్కువే. అందుకు తగ్గట్లే.. కొన్ని విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటిదే ఇప్పుడో ఉదంతం చోటు చేసుకుంది.
తన మ్యూజిక్ తో మేజిక్ చేసే తమన్ విషయానికి వస్తే.. సక్సెస్ లు ఆయన్ను పలుకరించుకుంటూ వస్తుంటాయి. అన్నింటికి మించిన ఆయనకో సెంటిమెంట్ ఉంది. తాను మొదటిసారి పని చేసే హీరో ఎవరైనా.. సినిమా ఏదైనా అది సూపర్ హిట్ కావటం ఖాయం.
తాజాగా ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయ్యింది గాడ్ ఫాదర్ రూపంలో. తాను తొలిసారి పని చేసిన హీరోలందరి సినిమాలు హిట్ అయినట్లుగా చెప్పిన తమన్.. గాడ్ ఫాదర్ హిట్ అయి.. తన సెంటిమెంట్ ను నిజం చేసిందన్నారు.
తన ఆరేళ్ల వయసులో తన తల్లితో కలిసి కోటిగారి రికార్డింగ్ స్టూడియోకి వెళ్లినప్పుడు.. 'అందం హిందోళం'పాట రికార్డింగ్ జరుగుతుందని.. ఆ పాట విన్న తర్వాత తాను చిరంజీవి ఫ్యాన్ అయిపోయినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడూ చిరంజీవి పాటలే వాయిస్తూ ఉండేవాడినని చెప్పారు.
మ్యూజిక్ స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్ గా సక్సెస్ కావటం మామూలు విషయం కాదన్న తమన్.. లండన్ లోని అబేయ్ రోడ్ స్టూడియోలో రికార్డు చేసిన తొలి భారతీయ చిత్రం గాడ్ ఫాదర్ గా పేర్కొన్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తన సెంటిమెంట్ గాడ్ ఫాదర్ తో మరోసారి నిజమైందన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు తమన్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.