హీరోల కష్టమేంటో ఇప్పుడు తెలిసింది

Update: 2015-08-23 22:33 GMT
బాహుబలి సినిమా చేసే వరకు తనకు హీరోలు పడే కష్టమెంతో తెలియలేదని చెప్పింది తమన్నా. ఈ సినిమా కోసం తొలిసారి ఫైట్లు చేయాల్సి వచ్చిందని.. అందుకోసం శిక్షణ తీసుకున్నపుడు.. ఆ సన్నివేశాల్లో నటిస్తున్నపుడు పడ్డ కష్టం అంతా ఇంతా కాదని.. ఫైట్లు చేయడంలో ఇంత కష్టం ఉందా అనిపించిందని.. హీరోలందరికీ పెద్ద సెల్యూట్ చేయాలనిపించిందని తమన్నా పేర్కొంది. బాహుబలి సినిమా అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘‘నేనో గొప్ప సినిమా చేస్తున్నానని తెలుసు. కానీ అది ఇంత పెద్ద సినిమా అవుతుందని ఊహించలేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ లైఫ్ టైం ఛాన్స్. నాకు కూడా ఈ సినిమాలో ఓ పాత్ర దక్కినందుకు చాలా చాలా లక్కీగా ఫీలవుతున్నా. ఒక సినిమాను మనం నమ్మి చేస్తాం. మన నమ్మకాన్ని మించి ప్రేక్షకులు ఆదరిస్తే దక్కే ఆనందం అంతా ఇంతా కాదు’’ అని తమన్నా చెప్పింది.

తనను టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా గుర్తించడం చాలా సంతోషమని.. ఐతే 13 ఏళ్లకే సినిమా రంగంలోకి అడుగుపెట్టడం వల్ల తానేమీ డ్యాన్సుల్లో శిక్షణ తీసుకోలేదని..  సినిమాల షూటింగుల్లోనే డ్యాన్స్ నేర్చుకున్నానని తమన్నా చెప్పింది. తన మాతృభాష సింధీ కంటే తెలుగే బాగా మాట్లాడతానని తన తల్లి వెటకారం చేస్తుంటుందని.. తెలుగుతో తాను  అంతగా కనెక్టయిపోయానని... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా తన ఆత్మబంధువులేనని తమన్నా  అంది.
Tags:    

Similar News