మూగబోనున్న మిల్కీ.. రెక్కలు వస్తాయా?

Update: 2017-04-15 06:34 GMT
మరోసారి బాహుబలి సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి.. మిల్కీ సోయగం తమన్నా బాగా క్యాష్‌ చేసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తోంది. గతంలో అసలు చేతిలో సినిమాలే లేవు అన్న తరుణంలో.. బాహుబలి రిలీజైంది. వెంటనే తమిళంలో రెండు.. తెలుగులో రెండు అన్నట్లు సినిమాలు సైన్ చేసింది ఈ ముంబయ్ సుందరి. ఇప్పుడు బాహబులి 2 సినిమాలో తనకు గ్లామరసం ఒలికించే రోల్ లేకపోయినా కూడా.. సినిమా సక్సెస్ తో తన బుట్టలో కూడా ఆఫర్లు వచ్చిపడతాయ్ అని ఆశిస్తోంది.

అయితే త్వరలోనే హిందీలో ఒక మూగమ్మాయ్ క్యారెక్టర్లో నటిస్తోందట తమన్నా. ఈ మధ్య కాలంలో అక్కడ కూడా గుడ్డివారి క్యారెక్టర్లు.. చెవిటి వారుగా హీరోలు హీరోయిన్లు.. ఇలా అనేక ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. హృతిక్ కాబిల్ సినిమా తరువాత.. ఈ ప్రయోగాలు ఇంకా ఎక్కువయ్యాయ్. అందుకే ఇప్పుడు నిర్మాత విపుల్ షా తమన్నాతో ఇలాంటి సినిమా తీస్తున్నాడని నిన్ననే అమ్మడు సెలవిచ్చింది.  అసలు మ్యాటర్ ఏంటంటే.. బాలీవుడ్లో ఏ రేంజులో ప్రయత్నించినా కూడా తమన్నా మాత్రం కొట్టలేకపోతోంది. అందుకే ఈ మూగమ్మాయ్ పాత్రతోనైనా అక్కడ తన కెరియర్ కు రెక్కలు వస్తాయేమోనని ఆశ పడుతోంది. చూద్దాం ఏమవుతుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News