ఫ్యామిలీ సినిమాలో బికినీలా ?

Update: 2019-01-08 06:04 GMT
తీసిన మూడు సినిమాలతో మాస్ జానర్ ని ఒప్పించి వరస సక్సెస్ లు ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి రెండోసారి స్టార్ హీరోని టేకప్ చేసాడు. ఇంతకు ముందు దిల్ రాజు బ్యానర్ లోనే రవితేజతో రాజా ది గ్రేట్ లాంటి సేఫ్ ప్రాజెక్ట్ ఇచ్చిన అనిల్ ఇప్పుడు ఎఫ్2 రూపంలో పెద్ద సవాలే ఫేస్ చేస్తున్నాడు. చాలా ఆలస్యంగా విడుదలకు ఐదు రోజుల ముందు ట్రైలర్ ను విడుదల చేసారు. ఫ్యాన్స్ వరకు రెస్పాన్స్ బాగానే ఉంది. అయితే ఒక సీన్ లో తమన్నా మెహ్రీన్ ఇద్దరూ బికినీలో రావడం వెంకీ వరుణ్ లు చూసి వామ్మో అంటూ షాక్ తినే సీన్ ఒకటుంది.

ముందు నుంచి అనిల్ రావిపూడి దిల్ రాజులు తమ సినిమాను కంప్లీట్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా చెప్పుకుంటూ వస్తున్నారు. కామెడీ కంటెంట్ అంత బలంగా ఉన్నప్పుడు ఇలాంటి బికినీ సీన్లు అవసరం పడవు. కథ ప్రకారం డిమాండ్ చేసింది అని సమర్ధించుకోవచ్చు కానీ ఇలా ఇద్దరు హీరోయిన్లను ఒకేసారి అలా నడిపించడం మాత్రం ముమ్మాటికి మాస్ కోసమే . అయితే ఇలాంటి సీన్లు పెట్టకూడదా అనే రూల్ ఏమి లేదు కాని పదే పదే ఫ్యామిలీ సినిమా అని చెప్పుకున్నప్పుడు ఇలాంటి అనుమానాలు రాకమానవు.

గతంలో జంధ్యాల లాంటి దర్శకులు ఎంత నవ్వించినా బికినీ వగైరా గ్లామర్ షోలకు దూరంగా ఉండేవాళ్ళు. కాని ఎఫ్2లో ఆ ఒక్క సీన్ చూస్తే మాత్రం ఎందుకో ఇబ్బందిగా అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి చేసుకున్నాక జీవితం అదోలోకంగా మారిపోయిన ఇద్దరు హీరోల కథతో రూపొందిన ఎఫ్2లో భారం మొత్తం కామెడీ మీదే ఉంది. అందులోనూ దీన్ని వెంకటేష్ ఎక్కువగా మోస్తున్నాడు. సో మూడు మాస్ సినిమాల మధ్య పందెంలో దిగిన ఎఫ్2 ఎంతవరకు నెగ్గగలదో వేచి చూడాలి


Full View

Tags:    

Similar News