పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్.?

Update: 2018-07-25 11:47 GMT
మొన్నటివరకూ వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నాకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. బాహుబలిలో నటించిన తర్వాత తమన్నాకు ఒక్క పెద్ద సినిమాలో కూడా చాన్స్ రాలేదు. వచ్చిన సినిమాల్లో కూడా పెద్దగా ఆకట్టుకునే పాత్రలేవీ లేవు. . దక్షిణాది వ్యాప్తంగా పాపులర్ అయిన తమన్నా  త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ తోపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  ఇప్పటికే తెలుగు - తమిళం - హిందీ భాషల్లోనూ నటించిన తమన్నాకు కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లకు పైగా అవుతోంది. దీంతో ఈ గ్లామరస్ బ్యూటీ ఇక సినిమాలు చాలించి పెళ్లి చేసుకోబోతోందనే వార్త విస్తృతంగా వ్యాపిస్తోంది.

సినిమా అవకాశాలు తగ్గడంతో తమన్నా ప్రస్తుతం పర్సనల్ లైఫ్ మీద దృష్టిపెట్టింది. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు తమన్నా కోసం ఓ మంచి వరుడిని ఎంపిక చేశారని వార్త ప్రచారంలోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్ తో త్వరలోనే తమన్నా వివాహం జరగనుందని సమాచారం. అయితే ఈ విషయంపై తమన్నా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘క్వీన్ రిమేక్’ సినిమాతో పాటు వెంకటేశ్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ మూవీలో నటిస్తోంది. 
Tags:    

Similar News