హీరోయిన్ గా ఒక రేంజులో ఉన్నప్పుడే అనవసరంగా ఐటెం పాటల్లో నటించి తన కెరయిర్ ను పాడుచేసింది శ్రీయ. కాని మిల్కీ సైరన్ తమన్నా మాత్రం.. ఇప్పటికే రెండు ఐటం పాటల్లో నర్తించినా కూడా.. ఇంకా మాంచి లైము లైటులోనే ఉంది. ఆ ఊపుతోనే ఇప్పుడు మరోసారి మరో ఐటెంలో చిందేయడానికి జెండా ఊపిందని తెలుస్తోంది.
తన రెండో సినిమా రచ్చ - మూడో సినిమా బెంగాళ్ టైగర్ లో మిల్కీ బ్యూటి దారబోసిన అందాల లెక్క ఏంటో మర్చిపోలేదట దర్శకుడు సంపత్ నంది. పైగా రెండు ఈ సినిమాల్లోనూ ఆమె మెరవడంతోనే ఒక మాంచి హిట్టు తన ఖాతాలో పడిందని ఈ దర్శకుడు నమ్ముతున్నాడు. అందుకే ఇప్పుడు తన 4వ సినిమాలో కూడా మనోడు తమన్నాను పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే గోపిచంద్ తో మనోడు చేయబోయే సినిమాలో హన్సిక - క్యాథరీన్ త్రెసాలను హీరోయిన్లుగా తీసేసుకున్నాడు కాబట్టి.. ఇప్పుడు తమన్నాను ఒప్పించి ఒక ఐటెం సాంగ్ చేయించుకుంటున్నాడట.
ఇకపోతే ఈ సాంగ్ చేయడానికి.. దాదాపు హీరోయిన్ గా తీసుకునేంత రెమ్యూనరేషనే తీసుకుంటుందని టాక్. మొత్తానికి సెంటిమెంటు కోసం మిల్కీతో ఇలా సెగలు లేపేస్తారన్నమాట. వెయిట్ అండ్ సీ.