టాప్ స్టోరి: పెళ్లంటే విర‌క్తి ఎందుకు?

Update: 2019-01-31 04:05 GMT
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి పెళ్లంటే విర‌క్తి ఎందుకు? అస‌లు పెళ్లి మాటెత్తితేనే ఆమ‌డ దూరం అనేస్తున్నారు. 30 క్రాస్ చేసినా - ఇంకా ఇంకా ఎందుకో ఈ విర‌క్తి? అంటే.. అందుకు స‌హేతుక కార‌ణాలు లేక‌పోలేద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. టాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌లుగా రాజ్య‌మేలుతున్న ప‌లువురు క‌థానాయిక‌ల పెళ్లి విష‌యంలో డాడ్స్ ఇప్ప‌టికీ క‌ల‌త‌గా - న‌ల‌త‌గానే ఉన్నార‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను ద‌శాబ్ధం పైగానే ఏలిన ప‌లువురు ముద్దుగుమ్మ‌ల్ని ప‌రిశీలిస్తే పెళ్లి అనే అంకంపై ఎందుకీ డైలెమా? అన్న ప్ర‌శ్న ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా - చంద‌మామ‌ కాజ‌ల్ - క్యూట్ త్రిష ..  వీళ్లంతా పెళ్లంటేనే ఆమ‌డ దూరం జ‌రుగుతున్నారు. కార‌ణం వెతికితే కాజ‌ల్ ఓ హీరోని ప్రేమించి ప్రేమ‌లో వైఫ‌ల్యం చెందాన‌ని చెబుతుంటుంది. ప్ర‌స్తుతం చంద‌మామ విశాఖ‌- అర‌కులోని గిరిపుత్రుల్ని ద‌త్త‌త తీసుకుని స్కూల్ నిర్మించి చ‌దువులు చెప్పిస్తోంది. సామాజిక సేవ‌కే జీవితాన్ని అంకితమిస్తోంది. ఇక త్రిష స‌న్నివేశం వేరు.. గ‌తంలో ఓ బిజినెస్ మేన్ కం ప్రొడ్యూస‌ర్ తో నిశ్చితార్థం అయ్యి పెళ్లి ఆగిపోవ‌డం సెట్ బ్యాక్ అయ్యింది. ఆ త‌ర్వాత పెళ్లి ఊసే ఎత్త‌లేదు. ఇక త‌మ‌న్నా స‌న్నివేశం ప‌రిశీలిస్తే.. గ‌త ఏడాది కెరీర్ ప‌రంగా అంత‌గా ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో తొలుత త‌ల్లిదండ్రుల‌కు పెళ్లి విష‌య‌మై గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందిట‌. అయితే 2019లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ ఐడియానే మార్చేసింది. ఎఫ్ 2 స‌క్సెస్ జోష్ లో ఉన్న త‌మ‌న్నాకు ఊపిరి స‌ల‌ప‌న‌న్ని అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయిట‌. దీంతో పెళ్లి అన్న మాటే ఎత్తొద్ద‌ని పేరెంట్స్ కి క‌రాఖండిగా చెప్పేసిందిట‌. ప్ర‌స్తుతం కెరీర్ ని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ఉంది ఈ బ్యూటీ.

ఇత‌ర భామ‌ల్లో పెళ్లి డైలెమా గురించి విశ్లేషిస్తే క‌థే వేరుగా ఉంది. స్వీటీ శెట్టి అనుష్క కు ఇంట్లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్నా సెట్ట‌వ్వ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే బ‌రువు త‌గ్గేందుకు విదేశాలు వెళ్లి నేచురోప‌తి విధానంలో  సీరియ‌స్ గా ట్రీట్ మెంట్ తీసుకుంటోంద‌ని ప్ర‌చార‌మైంది. కుటుంబ స‌మేతంగా కాళ‌హ‌స్తిలో రాహుకేతు - కాల‌స‌ర్ప యాగం చేశారు అప్ప‌ట్లో. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌ అనుష్క పెళ్లికి దూర‌మైంద‌న్న మాట వినిపిస్తోంది. ఇక వేరొక సీనియ‌ర్ భామ నిత్యామీన‌న్ పై ఎఫైర్ క‌హానీ వినిపించింది. ఇప్ప‌టివ‌ర‌కూ నిత్యా ఎందుక‌నో పెళ్లి మాటే ఎత్తలేదు. క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ కెరీర్ ప‌రంగా కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో సాగుతుండ‌డంతో పెళ్లి మాటే ఎత్త‌డం లేదు. అదీ సంగ‌తి.
    

Tags:    

Similar News