మిల్కీ బ్యూటీ తమన్నా - ప్రభుదేవా కలిసి నటించిన తమిళ హారర్ ఫిలిం 'దేవి'(తెలుగులో 'అభినేత్రి') 2016 లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. ఎఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా 'దేవి 2' ను రూపొందిస్తున్నారు. ప్రభుదేవా.. తమన్నాలతో పాటుగా నందిత శ్వేత కూడా ఈ సీక్వెల్ లో మరో కీలక పాత్రలో నటిస్తోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిలిం మేకర్స్ కాసేపటి క్రితం ప్రకటించారు. ఏప్రిల్ 12 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభుదేవా నైట్ డ్రెస్ లో టేబుల్ పైన కూర్చుని ఉన్నాడు.. పైన అంటే టేబుల్ పైనే..కానీ రెండు అంగుళాల పైన గాలిలో తేలుతూ కూర్చున్నాడు. అదే టేబుల్ పై ఎడమపక్కన ఒక జాడీ లాంటి సీసా.. పక్కనే సాంబ్రాణి పొగ వస్తున్నట్టుగా ఓ ఆరడజను తెలుపు రంగువి ఏవో ఉన్నాయి. ఈ టేబుల్ కు వెనకాల తమన్నా అందంగా చీరకట్టుకుని నిలబడింది. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న కిటికీ లో స్మశానం.. సమాధులు... కిటికీని తాకుతున్నట్టుగా కొన్ని చేతులు ఉన్నాయి. హారర్ అన్న తర్వాత ఇవే ముఖ్యం కదా.
మొదటి భాగాన్ని తమిళంతో పాటుగా తెలుగు.. హిందీ భాషలలో కూడా విడుదల చేశారు. మరి ఈ సినిమాను తెలుగులో 'అభినేత్రి 2' గా రిలీజ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికయితే తమిళ వెర్షన్ డేట్ గురించి మాత్రం క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు సామ్ సిఎస్. జీవీ ఫిలిమ్స్.. ట్రైడెంట్ ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో ఎఎల్ విజయ్ అనే పేరు వేసుకున్న దర్శకుడు ఈ సినిమాకు జస్ట్ విజయ్ తో సరిపెట్టాడు. న్యూమరాలజీ ఎఫెక్ట్ ఏమో.