తమన్నా తాగే స్లిమ్ కాఫీ ఏంటో తెలుసా?

Update: 2018-03-01 13:37 GMT
సినిమా తారలతో సహా మనలో ఎందరినో ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఊబకాయం. వయసుకు మించి లేదా శారీరక అవసరానికి మించి అధిక బరువుతో బాధ పడేవాళ్ళను నిత్యం మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళందరికి ఉన్న ఇబ్బంది దాన్ని తగ్గించుకునే మార్గం లేకపోవడం. అందుకే సినిమాల్లో స్లిమ్ గా ఉన్న హీరోనో లేదా హీరొయిన్ నో చూసినప్పుడు ఒక నిట్టూర్పు వదలటం తప్ప ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాని మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం అలాంటి వర్రీ అక్కర్లేదు, నా దగ్గర బ్రహ్మాండమైన చిట్కా ఉంది అని చెబుతోంది. పాల నురగ లాంటి అందాలతో, నాజూకుతనానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన తమన్నా చెబుతుంది అంటే అది ఖచ్చితంగా నమ్మదగినదే అనిపించడం చాలా సహజం. అదేంటో వింటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.

ఇంతకీ తమన్నా చెబుతున్న చిట్కా బటర్ కాఫీ. అవును. మీరు విన్నది నిజం. బటర్ కాఫీ. మనం ఇప్పటిదాకా లెమన్ కాఫీ, జింజర్ కాఫీ, ఆర్గానిక్ కాఫీ అంటూ ఏవేవో విన్నాం కాని కొత్తగా ఇదేంటి అని ఆశ్చర్యపోకండి. మనం రెగ్యులర్ గా తాగే కాఫీలోనే బటర్ వేసుకుని తాగితే ఒంట్లో ఉన్న కొవ్వు కరిగి స్లిమ్ గా మారడానికి హెల్ప్ చేస్తుందట. బ్లడ్ సర్కులేషన్, హార్ట్ బీట్ ఇవన్ని దీని వల్ల మెరుగు పడతాయట. వినడానికి బాగానే ఉంది కాని వేడి వేడి కాఫీలో బటర్ వేసుకుని తాగటం అనే వెరైటీ ఐడియా ఓసారి ట్రై చేస్తే పోలా.

సినిమాల విషయానికి వస్తే తెలుగులో రెండు స్ట్రెయిట్ సినిమాల్లో నటిస్తున్న తమన్నా తనకు మళ్ళి మేజర్ బ్రేక్ వస్తుందని చాలా నమ్మకంగా ఉంది. కళ్యాణ్ రామ్ తో ‘నా నువ్వే’లో రేడియో జాకీగా - క్వీన్ తెలుగు రీమేక్ లో కంగనా రౌనత్ చేసిన పాత్రను చేస్తున్న తమన్నా ఈ రెండు హిట్ అయితే మళ్ళి కొన్నాళ్ళు తెలుగులో చక్రం తిప్పే అవకాశం దక్కుతుంది. అందాక తమన్నా చెప్పిన కాఫీ ఓసారి ట్రై చేసేయండి.

 
Tags:    

Similar News