మధురై గుడిలో మిల్కీ పూజలు

Update: 2018-02-08 05:14 GMT
సినిమా జనాలకు సెంటిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుకే పూజలు- పునస్కారాలు.. వ్రతాలు- హోమాలు లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. అవకాశాలు రావాలని.. వచ్చిన క్రేజ్ నిలబడాలని.. కెరీర్ బాగోకపోతే మళ్లీ గాడిలో పడాలని.. ఇలా రీజన్స్ ఏవైనా పూజలు మాత్రం కామన్ గానే కనిపిస్తుంటాయి. కానీ ఇవన్నీ స్పెషల్ గా జరిపించుకోవడం సినీ తారల్లో ఆనవాయితీగా కనిపిస్తుంది.

మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం తను కొంచెం డిఫరెంట్ గా ఉండేందుకు ట్రై చేస్తుంది. రీసెంట్ గా ఈ సుందరి మధురై వెళ్లింది. మరి మధురై చేరుకున్నాక.. అక్కడ కొలువైన మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడం సహజం. అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన మిల్కీ బ్యూటీ.. సాధారణ భక్తులమాదిరిగానే క్యూలైన్ లో నుంచుంది. ఎంత మేకప్ వేసుకోకపోయినా.. ఇంతలోనే ఆమెను కొంతమంది గుర్తుపట్టేశారు. తమన్నా గుళ్లో ఉందనే విషయం ఆ ఏరియాలో నిమిషాల్లో పాకిపోయింది. గుడి ప్రాంతం అంతా పెద్ద హంగామా అయిపోయింది.

దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి జనాలను అదుపుచేయాల్సి వచ్చింది. తమన్నా మాత్రం స్పెషల్ పూజలు చేయించుకుని అక్కడి నుంచి బయల్దేరింది. చాలామంది అభిమానులు తమకు తమన్నా కనిపించలేదని తెగ ఫీలయిపోతే.. ఆమెను చూసిన వారు మాత్రం.. మిల్కీ ఎంతగా చిక్కిపోయి మెరిసిపోతోందో అని తెగ ముచ్చటపడిపోతున్నారు.
Tags:    

Similar News