ఆంధ్రా చేప‌ల పులుసుకి బ్రాండ్ అంబాసిడ‌ర్

Update: 2021-08-14 17:30 GMT
మిల్కీబ్యూటీ త‌మ‌న్నా సుదీర్ఘ ఇన్నింగ్స్ ని ఎంతో తెలివిగా కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌థానాయిక‌గా ఆఫ‌ర్లు త‌గ్గినా ఇప్పుడు త‌న కోసం డిజిట‌ల్ వేదిక టీవీ మాధ్య‌మం కూడా అందుబాటులో ఉన్నాయి. దీపం ఉండ‌గానే తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో ప్లాన్ ని ఛేంజ్ చేస్తోంది. ఇప్ప‌టికీ న‌వ‌త‌రం క‌థానాయిక‌ల‌తో సైతం పోటీ ప‌డి అవ‌కాశాలు అందుకుంటోంది. టాలీవుడ్ లో త‌మ‌న్నా కెరీర్ ఎంతో సుదీర్ధ‌మైన‌ది. దాదాపు  స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. ఐట‌మ్ గాళ్ గాను భారీ పారితోషికం అందుకుని వ‌చ్చిన అవ‌కాశాల్ని వినియోగించుకుంది.

ప‌లు సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతూ ఆర్జిస్తోంది. వీటికి అద‌నంగా రిబ్బ‌న్ కటింగ్ ల‌తోనూ ఆర్జించింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ కోలీవుడ్ లో అడ‌పాడ‌పా సినిమాలు చేస్తోంది. ఇత‌ర భాష‌ల్లోనూ నాయిక‌గా కొన‌సాగుతోంది. ఇంత‌లోనే ఓ బుల్లితెర షోకు హోస్ట్ గాను బిజీ అవ్వ‌బోతుంది. జెమినీ-తెలుగులో ప్ర‌సారం కానున్న `మాస్ట‌ర్ చెఫ్` షో కి హోస్ట్ గా వ్య‌వ‌రిస్తుంది.

రియాలిటీ షో ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప్ర‌తిరోజు ఒక కొత్త‌ అప్ డేట్ తో అమ్మ‌డు బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ లో ఉంటోంది. తాజాగా పాక శాస్త్రంలో త‌న‌ నైపుణ్యం గురించి  చెప్పుకొచ్చింది. ఏదైనా టూర్లు  వెళ్లిన‌ప్పుడు ఆ రాష్ట్రంలో స్థానికంగా ఉండే వంట‌ల్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుందిట‌. ముఖ్యంగా ఆంధ్రా స్టైల్ రుచులు అదిరిపోతాయ‌ని..అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రా వంటలు అసాధార‌ణ‌మైన రుచిని క‌లిగి ఉంటాయ‌ని తెలిపింది. ఇక్క‌డ చేప‌ల పులుసు అద్భుతంగా ఉంద‌ని తెలిపింది. అలాగే హైద‌రాబాద్ బిర్యానీ అన్నా అంతే ఇష్ట‌మ‌ని నోరూరించింది. ముంబైలోని త‌న స్నేహితుల‌కు హైద‌రాబాద్ నుంచి  చాలాసార్లు  బిర్యానీ పార్సిల్స్ పంపించిన‌ట్లు తెలిపింది.

ఇక్క‌డి స్వీట్లు... ఆంధ్రా పూత‌రేకులు కూడా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తానంది. అయితే వంట చేయ‌డం మాత్రం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న‌ట్లు తెలిపింది. ఇంటికొచ్చిన త‌ర్వాత కొత్త వంట‌కాల ప్ర‌యోగాలు చేస్తానని అంది. వంట చేయ‌డం ఇంట్లో అల‌వాటు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇన్నాళ్లు నేర్చుకోలేక‌పోయాన‌ని.. అమ్మ వంట గ‌దిలోకి వెళ్ల‌నిచ్చేది కాద‌ని  తెలిపింది. ఇక ఇదే షోకు త‌మిళ్ లో విజ‌య్ సేతుప‌తి.. క‌న్న‌డలో సుదీప్.. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ హోస్ట్ లుగా వ్య‌వ‌రిస్తున్నారు. ఆ ర‌కంగా ఇది జెమినీ టీవీలో పాన్ ఇండియా షోగా కీర్తికెక్క‌బోతోంది.
Tags:    

Similar News