మిల్కీ బ్యూటీ టాంగో డాన్స్

Update: 2018-01-20 14:53 GMT
పాల బుగ్గల సుందరి తమన్నా స్పీడ్ తగ్గినట్టు కనిపిస్తోంది కాని తన డైరీ ఖాళీగా అయితే లేదు. ఒక పక్క కంగనా రౌనత్ క్లాసిక్ మూవీ క్వీన్ తెలుగు రీమేక్ లో టైటిల్ రోల్ పోషిస్తూనే మరోపక్క కళ్యాణ్ రామ్ తో చేస్తున్న నా నువ్వే షూటింగ్ లో బిజీ బిజీగా ఉంది. రెండు ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలు. నా నువ్వే సినిమా కోసం తమన్నా అతి కష్టమైన టాంగో డాన్స్ నేర్చుకుందట. తనే స్వయంగా చెప్పింది. వినడానికి సులభంగా అనిపించే టాంగో డాన్స్ చేయడం చాలా కష్టం అంటున్న తమన్నా రిహార్సల్ టైంలో దెబ్బలు కూడా తగిలించుకుందట. డాన్స్ మాస్టర్ బృందా సహకారంతో తక్కువ టైంలో అందులో మెలకువలను నేర్చుకున్నానని, సినిమాలో ఉన్న హై లైట్స్ లో ఇది కూడా ప్రధానంగా ఉంటుందని చెబుతోంది.

నా నువ్వేలో తమన్నా రేడియో జాకీగా నటిస్తోంది. తన గొంతుని అటుపై తనను ప్రేమించే సిన్సియర్ లవర్ గా కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపించబోతున్నట్టు టాక్. సిద్దార్థ్ తో 180 లాంటి సెన్సిబుల్ లవ్ స్టొరీతో అందరిని మెప్పించిన దర్శకుడు జయేంద్ర నా నువ్వేకి కెప్టెన్, ఇటీవలే విడుదల చేసిన ప్రీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కళ్యాణ్ రామ్ ఎంఎల్ఎ  విడుదలకు అయ్యాక నా నువ్వే షెడ్యూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ తో మొదటిసారి జత కట్టిన తమన్నా ఇందులో పాత్రతో పాటు క్వీన్ మూవీ కూడా పూర్వ వైభవం తెస్తుందని తమన్నా చాలా హోప్స్ తో ఉంది.

అసలు టాంగో డాన్స్ ఎలా ఉంటుంది, తమన్నా ఎలా చేసింది అంటే కొద్ది రోజులు ఆగాలి కాని తన స్టెప్స్ లోని గ్రేస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రభుదేవాతో నటించిన అభినేత్రి సినిమాలో పబ్ సాంగ్ చూసేయండి అర్థమైపోతుంది. బద్రీనాథ్ లో బన్నీ తో పోటీగా స్టెప్స్ వేసిన తమన్నా టాంగో డాన్స్ కోసం దెబ్బలు తగిలేలా ప్రాక్టీసు చేసిందంటే నమ్మే విషయమే లేండి.
Tags:    

Similar News