మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర పోషించిన మొదటి వెబ్ సిరీస్ లెవంథ్ అవర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ ఏప్రిల్ 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ లో తమన్నా ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. కార్పొరేట్ యుద్ధంలో గెలుపే ధ్యేయంగా పోరాటం సాగించే కంపెనీ యజమానురాలు ఆరత్రికా రెడ్డి పాత్రలో తమన్నా కనిపిస్తున్నారు.
8ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఉపేంద్ర నంబూరి 2017 పుస్తకం 8 అవర్స్ స్ఫూర్తితో తెరకెక్కింది. ఈ సిరీస్ లో కార్పొరెట్ గేమ్ ఆద్యంతం రక్తి కట్టించే విధంగా రూపొందించామని ఇదివరకూ దర్శకుడు వెల్లడించారు. ఓ హోటల్ లో రాత్రి 11 గంటల నుంచి 8 ఏఎం వరకు జరిగే కథ ఇది. అంత తక్కువ సమయంలోనే ఆరత్రికా రెడ్డి (తమన్నా) బ్యాంకుకి 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తే అనంతరం ఏం జరిగిందనేదే కథాంశం.
ఇకపోతే తన ఆహా ఓటీటీ సిరీస్ ప్రచారం కోసం మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా విభిన్నమైన గెటప్ లో మీడియా కంటికి చిక్కారు. ముంబై ఛత్రపతి టెర్నినస్ వద్ద కలీనా ఎయిర్ పోర్ట్ (ప్రయివేట్ జెట్ లు దిగే చోటు) లో ఇంతకుముందు తమన్నా ప్రత్యక్షమై కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. తమన్నా అల్ట్రా పోష్ లుక్ సంథింగ్ స్పెషల్ అంటూ అభిమానులు ఈ ఫోటోల్ని వైరల్ చేస్తున్నారు. నీలి ఆకాశం రంగు డిజైనర్ దుస్తులకు హ్యాండ్ బ్యాగ్ స్థానంలో ఆ స్పెషల్ బ్యాగ్ వెరైటీగా కనిపిస్తోంది. మిల్కీ బ్యూటీ ఫ్రీస్టైల్ అభిమానుల్ని మైమరిపిస్తోంది.