కారులో న‌గ్నంగా కూర్చోబెట్టి వీడియో తీశాడుః న‌టి

Update: 2021-04-25 05:30 GMT
న‌గ్నంగా త‌న‌ వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఓ బుల్లి తెర న‌టి.. సీరియ‌ల్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పై ఫిర్యాదు చేసింద‌ని స‌మాచారం. ఈ మేర‌కు చెన్నై పోలీసు క‌మిష‌న‌రేట్ లో కంప్లైట్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. ఆ కంప్లైంట్ లో పేర్కొన్న వివ‌రాలు ఈ విధంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

మ‌నాలికి చెందిన తాను ఐదేళ్లుగా టీవీ సీరియ‌ల్స్ లో న‌టిస్తున్నాన‌ని, 2019లో త‌మిళ‌నాడుకు చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నాన‌ని తెలిపిన‌ట్టు స‌మాచారం. అయితే.. విభేదాలు రావ‌డంతో ఇద్ద‌రమూ దూరంగా ఉంటున్నామ‌ని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉంద‌ని పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది.

అయితే.. కొంత కాలంగా టీవీ సీరియ‌ల్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ న‌వీన్ కుమార్ అనే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్టు తెలిపింద‌ట‌. ఈ మ‌ధ్య అత‌ను ఉపాధి కోల్పోవ‌డంతో.. డ‌బ్బులు ఇవ్వాల‌ని వేధిస్తున్నాడ‌ని పేర్కొంద‌ట‌. త‌న వ‌ద్ద డ‌బ్బు లేద‌ని చెప్ప‌డంతో షూటింగ్ లొకేష‌న్ నుంచి త‌న‌ను తీసుకెళ్లి కారులో న‌గ్నంగా కూర్చోబెట్టి వీడియో తీశాడ‌ని, ఆ వీడియోతో త‌న‌ను బెదిరిస్తున్నాడ‌ని కంప్లైట్లో పేర్కొన్న‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యంలో అత‌ని త‌ల్లి కూడా న‌వీన్ కుమార్ కే స‌పోర్టు చేస్తోంద‌ని, ఇద్ద‌రూ త‌న‌ను వేధిస్తున్నార‌ని పోలీసుల‌కు తెలిపిన‌ట్టు స‌మాచారం. త‌న వీడియో ఇప్పించాల‌ని, త‌న‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న న‌వీన్ కుమార్‌, అత‌ని త‌ల్లిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో కోరిన‌ట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News