తమిళ 'బాహుబలి' సందడి మొదలు

Update: 2022-04-29 05:40 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో.. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఆధరణ అయితే దక్కించుకుందో అంతటి ఆధరణ తమిళ సినిమా 'పొన్నియన్‌ సెల్వన్‌' కు ఉంది. వసూళ్లు ఆ స్థాయిలో కాకున్నా కూడా ఖచ్చితంగా తమిళ సినీ చరిత్రలో నిలిచి పోయే వసూళ్లు నమోదు అవుతాయి అంటూ నమ్మకం వ్యక్తం అవుతుంది.

అతి పెద్ద మల్టీ స్టారర్ మూవీగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొలి భాగం విడుదలకు సిద్దం అయ్యింది. మరో ఆరు నెలల్లో ఈ సినిమా మొదటి పార్ట్‌ ను విడుదల చేయబోతున్నారు. సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో అప్పుడే ఏకంగా 125 కోట్ల రూపాయల ఓటీటీ బిజినెస్ చేసినట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సినిమా విడుదల సమయం కు అంచనాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కనుక ముందుగానే పొన్నియన్‌ సెల్వం సినిమా రెండు పార్ట్‌ లను అమెజాన్ 125 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమిళ సినీ చరిత్రలో వచ్చిన సినిమాల్లో అతి పెద్ద ఓటీటీ డీల్‌ గా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

మణిరత్నం దశాబ్ద కాలంగా ఈ సినిమా ను తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అంటూ చెప్తు మొదలు పెడతానంటూ చెబుతూ వచ్చాడు. కాని ఏవో కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అవ్వడం వల్ల భారీ సెట్టింగ్స్ తో పాటు భారీ ఎత్తును వీఎఫ్‌ఎక్స్ వర్క్ ను కూడా చేయిస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమాలో తమిళ స్టార్‌ విక్రమ్‌ తో పాటు ఐశ్వర్య రాయ్‌.. త్రిష.. జయం రవి.. కార్తీ.. శరత్‌ కుమార్‌.. ప్రభు.. విక్రమ్‌ ప్రభు.. పార్థిబన్.. శోభిత ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. రెండు పార్ట్‌ లు కూడా భారీ విజువల్‌ వండర్ గా ఉండటంతో పాటు అత్యంత భారీ స్టార్ కాస్టింగ్ తో భారీ టెక్నికల్‌ అంశాలతో రూపొందించబోతున్నారట.

ఈ సినిమా రెండు భాగాలకు కలిపి 500 కోట్ల బడ్జెట్‌ ను ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందే రమా రమీగా వెయ్యి కోట్లకు పైగానే నిర్మాత చేతుల్లోకి ఈ సినిమా తెచ్చి పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తమిళ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ లో ఈ సినిమా తప్పకుండా వంద కోట్లకు మించిన సినిమా గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News