దూకుడికి మారుపేరుగా నడిగర్ సంఘం వ్యవహారాలతో పాటు సినిమాల పరంగానూ వ్యవహరించే విశాల్ కు ఈ మధ్య అక్కడ అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇతర హీరోలతో మాటలు పడే దాకా తెచ్చేసుకున్నాడు. విషయానికి వస్తే నిన్న ఆర్ధిక లావాదేవీల కారణంగా వాయిదా పడ్డ అయోగ్య ఇవాళ ధియేటర్స్ లో అడుగు పెట్టింది. టాక్ కూడా బాగానే ఉంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ రీమేక్.
దీన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడంతో దీంతో పాటే షెడ్యూల్ చేసిన చిన్న సినిమాలకు స్క్రీన్లు దొరకలేదు. ఏ డేట్ లో రిలీజ్ చేయాలనే అంశంలో నిర్మాతల సమాఖ్యదే తుది నిర్ణయం. గత ఏడాది అక్టోబర్ లో విడుదలైన ఉదయా నటించిన ఉత్తరవు మహారాజా ఇలా గుంపులో నాలుగు సినిమాలతో కలిపి రిలీజ్ చేయడం వల్ల ఊహించిన దాని కన్నా ఎక్కువ డిజాస్టర్ అయ్యింది. దీనికి సంబంధించి అప్పుడే ఉదయా విశాల్ మీద ఫైర్ అయ్యాడు
తాజాగా దీని ప్రస్తావన వచ్చినప్పుడు విశాల్ మాట్లాడుతూ నలుగురైదుగురు వచ్చే అలాంటి సినిమాలను ఎక్కువ థియేటర్లలో రెండు వారాల పాటు ఆడించమని ఎలా అడుగుతామని చెప్పాడు. దీనికి స్పందించిన ఉదయా ఘాటుగా ఓ లెటర్ రాశాడు. అయోగ్య బాగా ఆడాలని కోరుకుంటూనే తక్కువ సంఖ్యలో చూశారు కాబట్టి నా సినిమాను ఫ్లాప్ అని ఎలా అంటరని రివ్యూస్ బాగా వచ్చి బిజినెస్ జరిగిన సినిమాను ఇలా కామెంట్ చేయడం గురించి నేరుగానే నిలదీశాడు.
భూమి గుండ్రంగా ఉంటుందని ఇప్పుడు పైన ఉన్నామని ఏదేదో అంటే చరిత్రలో మనకూ అలాంటి పరిస్థితే వస్తుందని చురకలు వేశాడు. మొత్తానికి ఒక పక్క కోర్టులో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు సంబంధించిన వివాదంలో చుక్కెదురు మరోపక్క అయోగ్య రిలీజ్ గొడవ ఇప్పుడీ ఉదయా ఓపెన్ లెటర్ చురుకులు. అన్ని ఒకేసారి చుట్టముట్టడం అంటే ఇదేనేమో