చిరంజీవా.. తమిళ హీరోల దిక్కయ్యావా?

Update: 2020-01-16 09:02 GMT
ఖైదీ - దొంగ.. చిరంజీవి కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ చిత్రాలివీ.. కానీ ఇప్పుడు ఇవే టైటిల్స్ తో తాజాగా వరుసగా తమిళ హీరో కార్తి సినిమాలు రిలీజ్ చేశాడు. ఇక ‘బిచ్చగాడు’ మూవీతో తెలుగు నాట ఫేమస్ అయిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ కూడా తాజాగా ‘ఇంద్ర’ - రోషగాడు - జ్వాల వంటి చిరు టైటిల్స్ వాడేసి తెలుగులో సినిమాలు రిలీజ్ చేశాడు.  చిరంజీవి అల్లుడు ధనుష్ తెలుగులో ‘రుస్తుం’ పేరుతో చిరు టైటిల్ ను వాడేశారు. ఇక తమిళ హీరో విజయ్ సైతం ‘మాస్టర్’ టైటిల్ తో తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి చిరంజీవి సినిమా టైటిల్ నే పెట్టుకుంటున్నారు.

ఇలా తమిళ హీరోలకు ఇప్పుడు చిరంజీవి దక్కయ్యాడు. ఇప్పటికే మార్కెట్ విస్తరించుకున్న సూర్య - కార్తి - విశాల్ - విజయ్ ఆంటోనీలాగే కొత్తగా వస్తున్న అజిత్ - విజయ్ లాంటి స్టార్ హీరోలు సైతం తెలుగు నాట తమ సినిమాలను మార్కెట్ చేసుకునేందుకు చిరంజీవిని తెగ వాడేస్తున్నారు.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగా ఫ్యామిలీ నిండా హీరోలే. అందుకే చిరంజీవి అభిమానగణాన్ని తమవైపునకు తిప్పుకునేందుకు ఇలా తమిళ హీరోలంత చిరు నామస్మరణం చేస్తున్నారు. వరుసగా చిరు సినిమాల టైటిల్స్ తోనే తెలుగు నాట తమిళ హీరోలు తమ సినిమాలు విడుదల చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.  దీన్ని మెగా ఇమేజ్ ను వాడుకునే ఎత్తుగడను వేస్తున్నారు.


Tags:    

Similar News