ఒకప్పుడు సీన్ ని తలుచుకుని కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే చియాన్ విక్రం కొత్త సినిమా రిలీజ్ అంటే మన స్టార్లకు సమానంగా హడావిడి ఉండేది. అపరిచితుడు ఇచ్చిన ఇమేజ్ పుణ్యమా అని విక్రమ్ సినిమాలు పాతిక పైగా తెలుగు మార్కెట్ ని ముంచెత్తాయి. ఇప్పుడు అంతా రివర్స్. మొన్న మిస్టర్ కేకే తమిళ్ తో పాటు తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేస్తే ఇక్కడ కనీసం అడిగే నాథుడు లేడు. చాలా చోట్ల మొదటి రోజే డెఫిసిట్ వచ్చేసి బయ్యర్లు లబోదిబోమన్నారు. ఇది విక్రమ్ సిచువేషన్.
ఇక గజినీ టైంలో తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేసే రేంజ్ ని మైంటైన్ చేసిన సూర్యకు మొన్న వచ్చిన ఎన్జికె తన మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో తేటతెల్లం చేసింది. ఈ సినిమా వచ్చిందన్న సంగతి కూడా చాలా ప్రేక్షకులకు తెలియనంత దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అందుకే రాబోయే బందోబస్తుని ఎవరు అడిగే సాహసం చేయడం లేదు. ఇక తమ్ముడు కార్తీ పరిస్థితి సైతం ఇలాగే ఉంది. చినబాబు తర్వాత దేవ్ ఒకదాన్ని మించి ఒకటి ఇంకా దిగజార్చాయి.
విశాల్ కొంచెం నయం అనిపిస్తున్నాడు కానీ అభిమన్యుడు మినహాయించి గత ఐదేళ్లలో ఇతనికి కనీసం యావరేజ్ మూవీ కూడా లేదు. తమిళనాడులో నువ్వా నేనా అంటూ కొట్టుకునే స్థాయిలో అభిమానం వెర్రి తలలు వేసే అజిత్ విజయ్ లకు ఇక్కడ పట్టుమని నాలుగు కోట్ల బిజినెస్ కూడా జరగడం లేదు. రజనీకాంత్ పేట ఐదు కోట్లు తేవడానికి కిందా మీద పడింది. తలైవా పేరు చెబితేనే భయం పుడుతోంది. ఇక కమల్ సంగతి సరేసరి. విశ్వరూపం 2 చూసాక మనవాళ్ళు నమ్మకాన్ని పూర్తిగా వదిలేసుకున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ని తీవ్రంగా ప్రభావితం చేసిన తమిళ స్టార్లు ఇప్పుడు జీరోకు రావడం వింతే. ఒకరకంగా వాళ్ళ పట్ల మన వేలం వెర్రి తగ్గడం మంచిదే