త‌మిళ్ రాక‌ర్స్ ఇదీ లీక్ చేశారా?

Update: 2019-03-31 06:49 GMT
త‌మిళ్ రాక‌ర్స్ టెర్ర‌ర్ యాక్టివిటీస్ గురించి తెలిసిందే. సినిమాలు తీసేవాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించ‌డం త‌మిళ్ రాక‌ర్స్ నిత్య‌కృత్యం. త‌మిళ‌నాడు కేంద్రంగా దేశ‌ - విదేశాల్లో స్థావ‌రాలు ఏర్ప‌రుచుకున్న‌ తంబీ మాఫియా సాగిస్తున్న అరాచ‌క కాండ‌ను ఎవ‌రూ ఎదుర్కోలేక‌పోయారు. న‌డిగ‌ర సంఘం - త‌మిళ నిర్మాత‌ల మండ‌లిలో కీల‌క భూమిక పోషిస్తున్న విశాల్ అంత‌టి వాడే ఎదురెళ్లినా త‌మిళ్ రాక‌ర్స్ ని ఆప‌లేక‌పోయారు. సినిమా ఏదైనా.. భాష ఇంకేదైనా త‌మిళ్ రాక‌ర్స్ ఖాతాలో ప‌డిపోవాల్సిందే. ఆన్ లైన్ పైర‌సీకి చిక్కాల్సిందే. ఇలా రిలీజైన సినిమాని అలా ఆన్ లైన్ పైర‌సీలో లీక్ చేసి భారీ న‌ష్టం వాటిల్లేలా చేయ‌డం వీళ్ల‌కే చెల్లింది.

కొన్ని సార్లు నేరుగా నిర్మాత‌ల‌కే వార్నింగులు ఇచ్చి పైర‌సీలో లీక్ చేస్తున్న త‌మిళ్ రాక‌ర్స్ ద‌ర్జా దొంగ‌త‌నంపై నిరంత‌రం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంది. రీసెంట్ గా రిలీజైన ప్ర‌తి సినిమా త‌మిళ్ రాక‌ర్స్ ఆన్ లైన్ పైర‌సీ ని అందుబాటులోకి తెచ్చారు. ఆ లింకుల్ని యూత్ షేర్ చేసుకున్నారు. తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కి ఈ సెగ త‌ప్ప‌లేదు. ఈ సినిమా హెచ్ డి ప్రింట్ తో ఆన్ లైన్ పైర‌సీలో అందుబాటులో ఉంచ‌డంతో ఈ లింకుల్ని ఏపీలో డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. 

ఎన్‌బీకే తెర‌కెక్కించిన ఎన్టీఆర్ - క‌థానాయ‌కుడు - మ‌హానాయ‌కుడు చిత్రాల్ని త‌మిళ్ రాక‌ర్స్ అప్ప‌ట్లో పైర‌సీ లింకులు అందుబాటులోకి తెచ్చారు. ఇటీవ‌ల రిలీజైన భారీ చిత్రాల‌న్నిటికీ పైర‌సీ దెబ్బ త‌ప్ప‌లేదు. తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కి పైర‌సీ ఓ ర‌కంగా మైన‌స్ కానుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక‌పోతే  ఏపీలో రిలీజ్ కాలేదు కాబ‌ట్టి యువ‌త‌రం పైర‌సీ లింకుల్ని డౌన్ లోడ్ చేసుకుని వీక్షించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌ట‌.
Tags:    

Similar News