సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య పైరసీ. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత చిన్న సినిమా అయినా పైరసీ బారిన పడి నలిగి పోతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సిమాల పైరసీ గురించి ప్రచారం జరగడం లేదు కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరుగుతూనే ఉంది. పైరసీ వల్ల సినిమాలు రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఆడుతున్న పరిస్థితి లేదు.
మొదటి వారం రెండు వారాల్లో సాధ్యం అయినంత ఎక్కువగా వసూళ్లు దక్కించుకునేందుకు ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోపు పైరసీ వచ్చేస్తుంది. కనుక రెండు మూడు వారాల తర్వాత థియేటర్ కు జనాలు వచ్చే పరిస్థితి లేదు. సినిమాల పైరసీ అనగానే తమిళ్ రాకర్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సినిమా నిర్మాతలను ఛాలెంజ్ చేసి మరీ తమిళ్ రాకర్స్ వారు సినిమాలను పైరసీ చేస్తున్నారు.
వెబ్ సైట్ ను బ్యాన్ చేయిస్తే తమ ఖాతాదారులకు మెయిల్ ద్వారా లింక్స్ ను షేర్ చేస్తూ మరీ సినిమా పైరసీ కి పాల్పడుతున్న తమిళ్ రాకర్స్ పై తాజాగా తమిళ్ లో తమిళ్ రాకర్స్ అంటూ ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ను కూడా తమిళ్ రాకర్స్ వదల్లేదు.
స్ట్రీమింగ్ అయిన అతి తక్కువ సమయంలోనే తమిళ్ రాకర్స్ ఈ వెబ్ సిరీస్ ను పైరసీ చేసి తమ ఖాతాదారులకు పంపించింది. పెద్ద ఎత్తున తమిళ్ రాకర్స్ ఈ వెబ్ సిరీస్ ను కూడా పైరసీ చేసి హై క్వాలిటీతో ఆన్ లైన్ ద్వారా అందిస్తున్న నేపథ్యంలో ఓటీటీ ద్వారా ఈ వెబ్ సిరీస్ ను చూసే వారు తగ్గి పోయారు అంటూ తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పైరసీ పై తీసిన వెబ్ సిరీస్ ను మరింత కక్ష కట్టి మరీ పైరసీ చేసి తమిళ్ రాకర్స్ సినిమా ఇండస్ట్రీకి ఛాలెంజ్ చేశారు. ఏం చేసినా కూడా మమ్ములను అడ్డు కోలేరు అంటూ వారు ఈ వెబ్ సిరీస్ ను పైరసీ చేసి మరీ నిరూపిస్తున్నారు.
సినిమా పైరసీని చూడకుండా ప్రేక్షకుల్లో ప్రచారం చేయడం తప్ప పైరసీని ఆపాలి అని చేసే ప్రయత్నాలు వృధా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.