వారసుడి పాత్ర పై మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Update: 2022-07-22 05:37 GMT
తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ మొదటి తెలుగు సినిమా 'వారసుడు' బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి అవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌ లో రెండు షెడ్యూల్స్ ను ముగించిన యూనిట్‌ సభ్యులు తదుపరి షెడ్యూల్‌ కోసం రెడీ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఒకే సారి తమిళ్ మరియు తెలుగు లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండు భాషల కోసం వేరు వేరు నటీ నటులను వినియోగించడం తో పాటు కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా రెండు వర్షన్‌ లకు వేరు వేరు గా చిత్రీకరిస్తున్నారట. అందుకోసం చిత్రీకరణకు కాస్త ఎక్కువ సమయం పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా లో విజయ్ పాత్ర పై సర్వత్రా చర్చ జరుగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా లోని కొన్ని ఫ్ల్యాష్ బ్యాక్‌ సన్నివేశాల్లో విజయ్ స్టూడెంట్‌ గా కనిపించబోతున్నాడట. ఆ తర్వాత వ్యాపారవేత్త గా కనిపిస్తాడని కూడా తెలుస్తోంది. ఒక ఫుడ్‌ యాప్ కు సంబంధించిన డిజైనర్‌ గా విజయ్ ఈ సినిమా లో కనిపించబోతున్నాడని.. సమాజం కోసం అతను చేసే పనికి కొందరు అడ్డు తగులుతూ ఉండగా వారి ఆట కట్టించే పాత్రలో విజయ్‌ కనిపిస్తాడని అంటున్నారు.

హీరోగా విజయ్ ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాడు. పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. కాని ఏ ఒక్కటి కూడా తెలుగు లో కమర్షియల్‌ విజయాన్ని అందుకోలేక పోయాయి. దాంతో విజయ్‌ నేరుగా తెలుగు సినిమా ను చేయాలనే ఉద్దేశ్యంతో వారసుడు సినిమా ను చేస్తున్నాడు.

ఈ సినిమా ను దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వారసుడు సినిమా పై తెలుగు లో కంటే ఎక్కువ తమిళంలో బజ్ ఉంది. విడుదల సమయంకు ఇక్కడ కూడా బజ్‌ క్రియేట్‌ చేసేలా దిల్‌ రాజు ప్రమోషనల్‌ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.

ఈ సినిమా సక్సెస్ అయితే విజయ్ ముందు ముందు తెలుగు లో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ సినిమా సక్సెస్‌ అవ్వాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి గత చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు. కనుక ఫలితం తప్పకుండా పాజిటివ్‌ గా ఉండే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News