జిమ్ యోగా అంటూ 5ఏఎం నిదుర లేచి కుర్ర భామలు శ్రమిస్తున్న తీరుకు ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఇంతకుముందు హీరోలు మాత్రమే అంతగా హార్డ్ వర్క్ చేసేవారు. కానీ ఇప్పుడు సన్నివేశం పూర్తిగా మారింది. హీరోలకు ధీటుగా కథానాయికలు కూడా క్రమశిక్షణతో ఫిట్ బాడీని తయారు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఇక నేటితరం భామలతో పోటీపడాలంటే సీనియర్ భామలు కూడా చెమటోడ్చాల్సి వస్తోంది. నయనతార.. సమంత.. త్రిష సహా సీనియర్లు చాలామంది జిమ్ములకు వెళ్లి రెగ్యులర్ గా కఠోర తపస్సు చేయాల్సి వస్తోంది. ఇదిగో రెండు దశాబ్ధాల కెరీర్ కి చేరువ అవుతున్న తమన్నా కూడా అందుకు మినహాయింపేమీ కాదు.
బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత తమన్నాకు అనూహ్యంగా గ్యాప్ వచ్చింది. ఇటీవల మళ్లీ కెరీర్ పరంగా బిజీ అయ్యింది. మళ్లీ గ్యాప్ కనిపిస్తోంది. ఈ ఒడిదుడుకులు లేకుండా సజావుగా కెరీర్ సాగాలంటే అందం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇదిగో ఇలా జిమ్ లో నిరంతరం శ్రమిస్తోంది. అలా ప్రణామం అంటూనే సింపుల్ గా కసరత్తులు చేస్తోంది. నడుము చుట్టూ కొవ్వు తగ్గాలంటే .. థై లుక్ ఎలివేట్ అవ్వాలంటే ఇదిగో ఇలా చేయాల్సిందే. యోగా మెడిటేషన్ విషయంలోనూ తమన్నా ఎంతో పక్కా టైమింగ్ పాటిస్తుంది. ఈ సీనియర్ బ్యూటీ నవతరానికి స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తమన్నా మొదటి తెలుగు వెబ్ సిరీస్ లెవెంథ్ అవర్ (11వ గంట) OTT ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ సిరీస్ `నవంబర్ స్టోరీ`తో OTT అరంగేట్రం చేసిన తరువాత ఇది తమన్నా కు రెండవ వెబ్ సిరీస్. ఇదేగాక.. గోపిచంద్ - తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా సిటీమార్ రిలీజ్ కి రావాల్సి ఉంది.