హీరొయిన్ శ్రీరెడ్డి ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. న్యూస్ ఛానల్స్ తో పాటు యు ట్యూబ్ ఛానల్స్ కూడా పోటీ పడి మరీ ఇంటర్వ్యూలు చేస్తుండటంతో తన కాల్ షీట్ దొరకటం కూడా బాగా కష్టమైంది. ఇండస్ట్రీ లో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఇక్కడ ఉన్న కొందరు పెద్దవాళ్ళ కామవాంఛల గురించి శ్రీరెడ్డి బయట పెట్టిన తీరు విస్తుపోయేలా చేసింది. ఈ ఇష్యూ పై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆరోపణలు చేయటం సులభమని వాళ్ళ పేర్లు బయట పెడితే చర్యలు తీసుకోడానికి మా అసోసియేషన్ తో పాటు నిర్మాతల సమాఖ్య కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. పలు ఇంటర్వ్యూలలో కొందరు హీరొయిన్లు ఈ విషయం గురించి మాట్లాడ్డం తాను కూడా చూశానని, అందులో వాస్తవాలు ఉండొచ్చని కాని పెద్ద నిర్మాణ సంస్థల్లో మాత్రం ఇలాంటి దిగజారుడు వ్యవహారాలు ఉండవని స్పష్టం చేసారు.
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామనే మీడియేటర్ల మాటలు విని గుడ్డిగా వెళ్ళకండని హితవు పలికారు. పత్రికల్లో తమ సినిమాలో ఛాన్స్ ఉందనే ప్రకటనలు ఎక్కువయ్యాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు పడితే వాళ్ళు పిలవగానే వెళ్ళకుండా నిజానిజాలు తెలుసుకుని మనల్ని పిలిచిన వ్యక్తి నిజంగా నిజాయితీగా సినిమా తీసేంత స్తోమత ఉందో లేదో తెలుసుకోవాలని కోరారు. ఇక్కడ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న తమ్మారెడ్డి ప్రతి విషయం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని లేదంటే జీవితాలు తలకిందులు అయిపోతాయని చెప్పారు. సినిమాలో వేషం ఇస్తామనగానే ముందు వెనుక చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళేముందు ఒకటికి రెండు సార్లు అలా రమ్మన్న వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసుకుని తద్వారా జాగ్రత్త పాడమని చెబుతున్నారు.
తమ్మారెడ్డి గారు చెప్పినవి లాజిక్ పాయింట్సే. కాని పేరు బయటికి రావడం అంత సులభం కాదు. శ్రీరెడ్డి కొన్ని పేర్లు చెప్పినప్పటికీ దేనికీ ఆధారాలు లేవు. మరి వీటికి చెక్ పడటం ఇప్పట్లో అవకాశం లేనట్టే.. రోజుకో హీరొయిన్ ఈ టాపిక్ మీద బయటికి వస్తుండతంతో ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి