సంక్రాంతి బరిలోకి నాలుగు సినిమాలు దిగటం.. నాలుగు రిలీజ్ కావటం తెలిసిందే. వీటి గురించి ఇప్పటికే చాలామంది రివ్యూలు ఇచ్చేశారు. కానీ.. టాలీవుడ్ పరిశ్రమలో పెద్దమనిషిగా.. ఉన్నది ఉన్నట్లుగా.. ఫ్రాంక్ గా మాట్లాడే మనిషిగా పేరున్న టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా తన అభిప్రాయాన్ని ఓపెన్ చెప్పేశారు. మంచిచెడుల గురించిఇంత వివరంగా ఒక సినిమారంగ ప్రముఖుడు మాట్లాడింది ఇదేనేమో. ఇంతకీ ఆయన మాట్లాడిందేమిటన్నదిచూస్తే..
ఖైదీ నంబరు 150 గురించి..
పదేళ్ల తర్వాత వచ్చారు. అమ్మడు.. కుమ్మడు..రత్తాలు అనుకుంటూ కలెక్షన్లు కుమ్మేస్తున్నారు. ఆయన్ను చూస్తున్న ఫ్యాన్స్ కు కన్నుల పండుగైపోయింది. నావరకూ నాకేమిటంటే.. ఆసినిమాలో ఉన్న ఉదాత్తమైన సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్ ఇంకా బాగుంటే బాగుండనిపించింది. ఆయన సినిమా కత్తి అని చెప్పకుండా తీసి ఉంటే.. గొప్ప సినిమా. చిరంజీవి సినిమాల్లో గొప్ప సినిమా అవుతుంది. కత్తి అని చెప్పాక.. కత్తి చూశాం కాబట్టి.. కత్తిలో మాదిరి కొన్నిసీన్లుఉంటే బాగుండనిపిస్తుంది. కనీసం.. క్లైమాక్స్.. క్లోజింగ్ సీన్లు ఉంటే బాగుండనిపించింది. అలా లేకపోయినా కలెక్షన్లు సునామీ చేస్తుంది కాబట్టి.. నేను కరెక్టో.. వాళ్లు కరెక్టో? ప్రజలే కరెక్ట్.. బాగా చూస్తున్నారు కాబట్టి. బట్.. ఈ రోజుకి కూడా నా ఆలోచనను నేను మార్చుకోవటం లేదు. నేను ఏమంటానంటే.. చిరంజీవిగారు చిరంజీవిగారే అనేది ప్రూవ్ అయిపోయింది.
బట్.. చిరంజీవిగారు మిరాకిల్ చేయగలరు. ఆయనకు ఈ కలెక్షన్లు చాలవు. ఇంకా కలెక్షన్లు ఇవ్వగలరు. సమాజానికి పనికివచ్చే కథ కూడా కత్తి. ఇందాకే చెప్పినట్లు.. మళ్లీ మళ్లీ సోదిలా ఉంటుంది. అలాంటి సినిమాను ఇంకా బాగా ఆవిష్కరించి ఉంటే బాగుండేదనిపించింది. చిరంజీవిగారు చిరంజీవి గారే అన్నది మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ఆయన మిరాకిల్స్ చేయగలరు. ఆయనకు ఈ వసూళ్లు సరిపోవు. ఇంకా ఆయన చేయగలరు. కత్తి సినిమాను మరింత బాగాఆవిష్కరిస్తే బాగుండేది. ఆ విషయంలో నేను ఇప్పటికీ డిఫర్ కావటం లేదు. ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదని అనుకుంటున్నాను ఇప్పటికీ. దాన్లో నుంచి నేను ఇంకా డిపర్ అవ్వటం లేదు.
శాతకర్ణి సినిమా గురించి..
ట్రైలర్ చూడగానే బాగుందని అనుకున్నా. సినిమా చూసిన తర్వాత చాలా బాగుందనిపించింది. బాలకృష్ణ సినిమాల్లో ఇదే హయ్యస్ట్ రెవెన్యూ తెచ్చిన సినిమా అవుతుంది. ఆయన కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమా ఇదే అవుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంత షార్ట్ టైంలో తీసి.. టెక్నికల్ గా పర్ ఫెక్ట్ సినిమా ఇదే. బాహుబలి వేరే.. ఈ సినిమా వేరే. బాహుబలి జానపదం. శాతకర్ణి చరిత్రను జానపదం చేసిన సినిమా. శాతకర్ణిలో బాలకృష్ణ నటనకానీ.. క్రిష్ డైరెక్షన్ కానీ.. సాయిమాధవ్ మాటలు కానీ.. కెమేరామన్ పనితనం కానీ చూస్తే.. తెలుగు సినిమాను టెక్నికల్ గా మరో లెవెల్ కు తీసుకెళ్లిన సినిమాగా చెప్పాలి.
శతమానం భవతి గురించి..
సరదాగా ఉంది. సినిమా బాగుంది. సీతారామయ్య మనమరాలు సినిమా నుంచి చూస్తున్నదే.. పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయి రాకపోవటం లాంటివి. సినిమా చూసినంతసేపు చాలా బాగుంది. సరదా ఉంది. బట్.. ఈ రోజుల్లో ఫారిన్ నుంచి వస్తున్న వాళ్లే ఎక్కువగా వస్తున్నారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్లే రావట్లేదు. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే చైతన్యపురిలో ఉన్న వాళ్లు బీహెచ్ ఎల్ లో ఉన్న తల్లిదండ్రుల వద్దకే ఎక్కువగా రావట్లేదు. ఓల్డేజ్ హోమ్ లోఉన్న తల్లిదండ్రుల వద్దకే సరిగా వెళ్లటం లేదు.
ఫారిన్ లో ఉన్న వాళ్ల మీద పడే కంటే.. మన మీద మనమే పడిపోతే బాగుండు. సెంటిమెంట్స్ బాగా చూపించారు. కాకుంటే.. ఆ అవిష్కరణ మనకు కూడా కనువిప్పు కలిగించేలా ఉంటే బాగుండేది. నిజానికి ఫారిన్ లో ఉన్న వాళ్లు పండగలు బాగా చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే.. ఈ మధ్యన ఫారిన్ లో ఉన్న వారే ఏడాదికి ఒకసారి వస్తున్నారు. వాళ్లతో పోలిస్తే.. ఇందాక చెప్పినట్లు చైతన్యపురిలో ఉన్న వాళ్లకు బీహెచ్ఈఎల్ కు వెళ్లి రావటమే కష్టంగా ఉంది.ట్రాఫిక్ వల్ల కావొచ్చు. అదే సినిమామన మీద చూపిస్తే బాగుండేది. నెక్ట్స్ ఇయర్ అలాంటి సినిమా వస్తుందని అనుకుందాం.
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య
దురదృష్టవశాత్తు నారాయణ మూర్తిగారి సినిమా చూసేందుకు నాకు అవకాశం కలగలేదు. రేపు చూస్తాను. దాని గురించి చెబుతాను. పండగ బాగా చేసుకున్నాం. ఈ సంవత్సరాన్ని ఎంజాయ్ చేద్దాం.
నారాయణమూర్తి సినిమా వివాదంపై
సినిమాలకు పండగైంది. చిరు.. బాలకృష్ణ.. శర్వానంద్ సినిమాలు సూపర్ హిట్. నేనుముందు అనుకున్నట్లు చిరు.. బాలకృష్ణ సినిమాలు వంద కోట్లు టచ్ చేస్తున్నాయి. అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే.. చిరు.. బాలకృష్ణ ఫ్యాన్స్ కు పండగొచ్చింది. చిరు.. బాలకృష్ణ కెరీర్లకు హయ్యస్ట్ రికార్డులు అవుతాయి. గత రెండు సంవత్సరాల నుంచి శర్వానంద్ రెండు సినిమాలు అదరగొట్టేశారు.
నారాయణమూర్తిగారు ఆ సందట్లో వచ్చారు. ఆయన సినిమా కూడా బాగుంది. కాకుంటే ఆయన సినిమాలకు థియేటర్లు దొరకలేదు. జరగాల్సింది.. జరిగి పోయింది. నిర్మాతలేమో మన సినిమా పండగక్కి వస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎగ్జిబిటర్లు జనాల్లో క్రేజ్ ఏ సినిమాకు ఉంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫ్యాన్స్ తమ హీరోల సినిమాలకు.. జనాలేమో టాక్ వచ్చిన సినిమాలకు వెళుతుంటారు. శతమానం భవతి.. నారాయణమూర్తి సినిమాలనిర్మాతలు స్ట్రాంగ్ కాబట్టి తట్టుకోగలిగారు. దిల్ రాజుగారికి ఆయన సినిమా థియేటర్లు ఉన్నాయి కాబట్టి థియేటర్లు కొన్ని దొరికాయి. నారాయణమూర్తిగారి నిర్మాత స్ట్రాంగ్ అయినప్పటికీ థియేటర్లు చేతిలో లేవు కాబట్టి హాల్స్ దొరకలేదు.
సినిమాలు తీయటం నిర్మాతకు ఎంత ముఖ్యమో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లటం కూడా అంత ముఖ్యం. సినిమా తీసి.. జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో కాస్త వెనక్కి తగ్గటం తప్పేం కాదు. అదేం పరువు పోవటం కాదు.. ఒక అడుగు వెనుక వేసి.. తర్వాత రెండు అడుగులు ముందుకు వేయటం. అది చేసి ఉంటే నారాయణమూర్తి సినిమాకు న్యాయం జరిగి ఉండేది. ఎగ్జిబ్యూటర్స్ థియేటర్లు ఇవ్వలేదని అనేయటం సరికాదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈవారమైనా థియేటర్లు దొరికి సినిమాను నిలబెడతారని అనుకుందాం.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/