సెలబ్రిటీ లైఫ్ లో ట్రోలింగ్ జీవన శైలిలో ఓ భాగంలా మారిపోయింది. హీరో..హీరోయిన్లు..దర్శక..నిర్మాతలు ఇలా ఏ ఒక్కరినీ విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎంతటి వారికైనా ఈ ట్రోలింగ్ సీన్ తప్పడం లేదు. చిరంజీవి..అమితాబ్ లాంటి లెజెండరీలే ట్రోలింగ్ బారిన పడ్డారంటే? సన్నివేశం ఎంత తీవ్రంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇక హీరోయిన్ల విషయంలో జరిగే ట్రోలింగ్ గురించి అయితే మాటల్లో చెప్పలేనిది.
రోజూ ఎవరో ఒకరు నెట్టింట ట్రోలింగ్ ఫేస్ చేయాల్సిందే. లేదంటే ట్రోలర్ల కి డే గడవడం లేదు. దీన్ని టైంపాస్ గేమ్ గా భావించినా..ఇదే ఓ వృత్తిగా భావించినా? ఎవరూ ఎలా తీసుకున్న పర్లాదు. మా పని మాత్రం మేము ఆపమంటూ ముం ందుకెళ్లిపోవడమే ట్రోలర్ల పని. ట్రోల్ చేసిన వారికి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినా అవి అంతే సహజంగా మారిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా అసలు ట్రోలింగ్ ఎందుకు జరగుతోంది? అందుకు కారకులు ఎవరు? ఎవరి తప్పు ఎంత? అనే అంశాల్ని దర్శక..నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషించే ప్రయత్నం చేసారు. 'సాధారణంగా ట్రోలింగ్ బారిన పడటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎవరైతే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పబ్లిక్ లో పెడతారో అలాంటివారే ట్రోలింగుకి గురవుతూ ఉంటారు.
కొంతమంది అమ్మాయిలు 'నేను సింగిల్' అని ఫేస్ బుక్ లో పెడుతుంటారు. ఆమె సింగిల్ గా ఉంటే ఏంటి? .. డబుల్ గా ఉంటే ఏంటి? అసలు ఆ విషయం బయటికి చెప్పడం ఎందుకు? అనవసరమైన విషయాలను పోస్ట్ చేయడం అంటే అవతల వారిని రెచ్చగొట్టడమే కదా? అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరైనా ..ఏ సందర్భంలోనైనా వ్యక్తిగత విషయాలో సోషల్ మీడియాలో షేర్ చేయడమే సెలబ్రిటీల కొంప ముంచుతుంది.
మరికొంత మంది పెళ్లి వీడియో రైట్స్ టీవీలకో .. డిజిటల్ ఓటీటీలకో అమ్మేస్తున్నారు. పెళ్లి అనేది కుటుంబానికి సంబంధించిన అంశం. ఇక హనీమూన్ అనేది పూర్తిగా ఆడ-మగ మధ్య మాత్ర మే ఉండాల్సిన రహస్య విషయం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి హనీమూన్ అనేది పెట్టారు. చివరికి హనీమూన్ కి సంబంధించిన విషయాలను కూడా అమ్మేస్తున్నారు.
వీళ్లంతా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నట్టు? ఏం చేయాలనుకుంటున్నట్టు? మనం నోరుమూసుకుని కూర్చుంటే .. ఎదుటివారు ఏం మాట్లాడతారు? అందుకు భిన్నమైన పనులు చేస్తే ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి'. ముందు మనం మారాలి. ఆ తర్వాత వాళ్లలోనూ మార్పు వస్తుంది. అలా కాకుండా ట్రోలింగ్ జరిగిందని లబోదిబోమంటే ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.