దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా సినిమా పరిశ్రమకు చెందిన చిన్నా పెద్దా వేడుకల్లో తరచుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కొన్ని సార్లు విమర్శల పాలయ్యేలా చేసింది. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఎస్ వి రంగారావు బయోగ్రఫీ బుక్ 'మహానటుడు' ఆవిష్కర కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యాడు. అదే కార్యక్రమంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈమద్య చిరంజీవి గారు ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా మీరు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండాలి. పరిశ్రమకు చెందిన అన్ని వ్యవహారాలు మీరే చూసుకోవాలంటూ కోరుతూ వస్తున్నాను. ఆయన నామాటపై కొన్నింటిని తన నెత్తిన వేసుకుంటున్నారు. దాంతో ఆయన కొన్ని సార్లు మాట కూడా పడాల్సి వస్తుంది. నన్ను కొన్ని సార్లు తిట్టుకుని ఉంటాడు. అయినా కూడా ఆయన మంచి మనసుతో సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇటీవల ఒక వ్యక్తి నాకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు అంటూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలా ఖర్చు చేసే బదులు వాటిని గ్రామాల అభివృద్ది లేదంటే మరేదైనా కార్యక్రమాలకు ఉపయోగిస్తే బాగుంటుంది కదా అంటూ అభిప్రాయ పడ్డాడు. మనిషి 500 రూపాయల చందా వేసుకుని ఏదైనా మంచి పని చేస్తే వారి అభిమాన హీరోకు మంచి పేరు వస్తుంది వారికి సంతృప్తి కలుగుతుంది అన్నారు.
చిరంజీవి గారి వద్ద ఇదే విషయాన్ని నేను చెబితే చాలా బాగుందని అన్నారు. చిరంజీవి గారి ఫ్యాన్స్ తో పాటు ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా కూడా ఇలాంటి పనులు చేయాలని తమ్మారెడ్డి కోరారు. హీరోలు ఏది చెబితే అది చేసేందుకు ఫ్యాన్స్ సిద్దంగా ఉంటారు. అందుకే వారిని సరిగ్గా వినియోగించుకోవాలని హీరోలకు తమ్మారెడ్డి సలహా ఇస్తున్నారు. మరి హీరోలు ఈ విషయాన్ని ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.