సినీ పరిశ్రమలోని ఆసక్తికరమైన పరిణామాల విషయంలో నిక్కచ్చిగా స్పందించే సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా అధికార బీజేపీ నేతలపై ఉగ్రరూపం దాల్చారు. ``సినిమా తీసే వాళ్ల కుటుంబాల్లో మహిళలు ప్రతిరోజూ భర్తలను మార్చేస్తుంటారు. దుష్ట మనస్తత్వాలతో నన్ను చికాకు పెట్టే దర్శకులను చెప్పుతో కొడతాను..`` అని బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ..సినిమా వాళ్ల భార్యలను ఉద్దేశించి కామెంట్లు చేశారు. దీన్ని తప్పుపట్టిన తమ్మారెడ్డి తన అఫిషియల్ యూట్యూబ్ పేజీలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోరు ఉంది కదా అని వాగితే తాట తీస్తానంటూ...గట్టి వార్నింగ్ ఇచ్చారు.
``ఎవరి మీదైనా కోపం వస్తే.. వాళ్లను మాత్రమే తిట్టాలి.. అంతేకానీ సినిమా వాళ్ల మహిళను కించపరుస్తూ మాట్లాడటం దారుణం. సినిమా వాళ్ల భార్యలు ఊరికే దొరికారా? ఏమిటతని ఉద్దేశ్యం? నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవాలా? సమాజంపై ప్రభావం చూసే సినిమాను, వాళ్ల కుటుంబ సభ్యుల చులకనగా మాట్లాడే హక్కు అతనికేక్కడిది? చేతిలో ప్రభుత్వం ఉందని.. ఏది పడితే అది చెయ్యొచ్చని అనుకుంటే సహించే ప్రసక్తే లేదు. అలాంటి పరిస్థితి వస్తే... సినిమా పరిశ్రమ అంతా ఏకమైతే ఎలా ఉంటుందో మీకూ తెలీదు. చూపించాల్సిన పరిస్థితి వస్తే చూపిస్తాం ఖబడ్దార్`` అంటూ హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు క్షమించరాని నేరమని.. ఖండించకుండా ఊరుకోవటం కూడా చాలా కష్టం ఆయన స్పష్టం చేశారు.
గతంలో సినీ పరిశ్రమవర్గాలను టార్గెట్ చేసిన ఉదంతాన్ని సైతం ఈ సందర్భంగా తమ్మారెడ్డి ప్రస్తావించారు. గతంలో కమల్ హాసన్ వైవాహిక జీవితం గురించి కూడా ఇదే రీతిలో మాట్లాడారని పేర్కొంటూ ఇదేం తీరని ఆయన ప్రశ్నించారు. వివాహాలు, విడాకులు దేశంలో ఇప్పుడు సర్వసాధారణమైపోయాయని పేర్కొంటూ..సినిమా వర్గాలను ప్రత్యేకంగా టార్గెట్ చేడయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కొత్త మొగుళ్లు..పెళ్లాల సంస్కృతిలో కొందరు బీజేపీ నేతలు సైతం ఉన్నారని పేర్కొంటూ..తనకు సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టి అలాంటి వివరాలను బయటపెట్టడం లేదన్నారు.