ఒక డాక్టర్. ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతుంటాడు. సంతానం కోసం అతడి దగ్గరికి బోలెడంత మంది వస్తుంటారు. అందులో కొందరు వీర్య దానం ద్వారా సంతానం పొందడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కానీ సరైన వీర్య దాత దొరక్కపోవడంతో డాక్టర్ ఇబ్బంది పడుతుంటాడు. సంతానం కోసం ప్రెజర్ చేస్తున్న వాళ్లకు సమాధానం చెప్పలేకపోతుంటాడు. ఇలాంటి టైంలో ఓ కుర్రాడిపై ఆ డాక్టర్ కళ్లు పడతాయి. ఇక ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. ఇలాంటి కథతో ఏ హాలీవుడ్ లోనో సినిమాలు వస్తే ఆశ్చర్యమేమీ లేదు కానీ.. ఇండియాలో ఓ సినిమా తెరకెక్కడం.. అది సూపర్ హిట్టవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘విక్కీ డోనర్’ ఆ ఘనత సాధించింది.
నాలుగేళ్ల కిందట బాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు హీరో సుమంత్. హిందీలో ఆయుష్మాన్ ఖురానా చేసిన హీరో పాత్రను తనే చేస్తూ.. స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కూడా. మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీ పరిచయమవుతున్నాడు. పల్లవి సుభాష్ కథానాయిక. హిందీలో సీనియర్ నటుడు అన్ను కపూర్ ఈ డాక్టర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. దీనికి గాను ఆయనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. తెలుగులో ఆ పాత్ర కోసం కొందరు బాలీవుడ్ నటుల్నే పరిశీలించి.. చివరికి తనికెళ్ల భరణిని ఆ క్యారెక్టర్ కు ఎంచుకున్నట్లు సమాచారం. భరణి కచ్చితంగా ఈ పాత్రను రక్తికట్టిస్తాడనడంలో సందేహం లేదు.