తనీష్ ను సేవ్ చేసిన బిగ్ బాస్...?

Update: 2018-08-27 05:46 GMT
బిగ్ బాస్ మరో మూడు వారాలు మాత్రమే ఉంది.. ఇప్పుడు హౌస్ లో తిరిగొచ్చిన నూతన్ నాయుడితో కలిసి మొత్తం 11 మంది సభ్యులున్నారు. ఫైనల్ చివరి వారంలో ఐదుగురు కంటెస్టెంట్లు ఉండాలి. అంటే ఇంకా రెండు వారాల్లో ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగులు ఎలిమినేషన్ కావాలి. కానీ వారానికి ఇద్దరిని మాత్రమే ఎలిమినేషన్ చేసే చాన్స్ ఉంది. అంటే ఈ ఆదివారం కూడా ఇద్దరు వెళ్లిపోవాల్సి ఉండేది. కానీ కావాలనే తనీష్ ను సేవ్ చేయడం కోసం ఎలిమినేషన్ లో ఒక్కరికే బయటకు పంపారనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.

ఈ వారం నామినేషన్ లో మొత్తం నలుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. కౌశల్ - తనీష్ - దీప్తి - పూజల్లో అతి ఎక్కువ ఓట్లు కౌశల్ కు రాగా.. రెండో స్థానంలో దీప్తి నల్లమోతు - మూడో స్థానంలో తనీష్ ఉన్నట్టు బజ్ ను బట్టి తెలుస్తోంది.. చివరి స్థానంలో ఉన్న పూజాను నాని ఈ ఆదివారం ఎలిమినేట్ చేశాడు. ఈ నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ ఊహించినా అది సాధ్యం కాలేదు. తనీష్ ను ఎలిమినేట్ కాకుండా కాపాడేందుకే అతడిని బిగ్ బాస్ టీం - నాని సేవ్ చేశారనే  ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారంటే అది కౌశల్, రెండో ప్లేసులో తనీష్.. వీరిద్దరూ ఆది నుంచి గొడవపడుతూ బిగ్ బాస్ కు కావాల్సిన మసాలా యాడ్ చేస్తున్నారు. పైగా నాని రికమండేషన్ తో బిగ్ బాస్ లోకి తనీష్ వచ్చినట్టు ప్రచారంలో ఉంది. నానికి-తనీష్ కు మధ్య మంచి స్నేహబంధం ఉంది. తాను అప్పుల్లో ఉంటే నానియే ఆర్థిక సాయం చేసి ఆదుకున్నాడని స్వయంగా గత ఎపిసోడ్లలో తనీష్ ఎమోషన్ అయ్యాడు. వీటన్నింటిని బేస్ చేసుకొని మూడో స్థానంలో ఉన్న తనీష్ ను ఎలిమినేట్ కాకుండా ఈ వారం బిగ్ బాస్ టీం ప్రయత్నించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మరో మూడు వారాలుండగా.. ప్రస్తుతం పది మంది ఉన్నారు. రాబోయే రెండు వారాలు డబుల్ ఎలిమినేష్ చేస్తే ఆరుగురు ఉంటారు. ఆ ఆరుగురే ఫైనల్ లో ఉండేలా ప్లాన్ చేశారో ఏమో చూడాలి మరి..
Tags:    

Similar News