తాప్సి లిస్టులో అవేంజర్స్ రోల్

Update: 2022-07-09 10:34 GMT
సొట్టబుగ్గల సుందరి తాప్సీ మొదట తెలుగు సినిమాలతోనే రెగ్యులర్ హీరోయిన్ గా కనిపించింది. ఝుమ్మంది నాదం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ పంజాబీ ముద్దుగుమ్మ చాలా కాలంగా తెలుగు సినిమాలతో బిజీగానే కనిపించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో అయితే ఆమెకు గుర్తింపు లభించింది లేదు. దీంతో అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేసింది.

ఎప్పుడైతే జూడ్వా 2 సినిమాలో బికినీలో కనిపించిందో ఆ తర్వాత ఒక్కసారిగా అక్కడి ఆడియెన్స్ దృష్టిలో పడింది.  అనంతరం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా విభిన్నంగా కొన్ని కంటెంట్ బేసిడ్ సినిమాలను కూడా చేసింది. పింక్, బద్లా ఇలా ఎన్నో ప్రయోగాత్మకమైమ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ నటనకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో ఏదో ఒక విధంగా ఒక గుర్తింపు అయితే అందుకుంది.

ఒక ప్రస్తుతం ఈ బ్యూటీ నుంచి మరొక మంచి సినిమా రాబోతోంది. ఉమెన్ లెజెండరీ క్రికెటర్ మిథాలి రాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న శభాష్ మీతు సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ తరుణంలో ఆమె సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యారెక్టర్ గురించి ఒక వివరణ ఇచ్చింది. ఇప్పటికే చాలా రకాల పాత్రలు చేశానని అయితే ఇప్పటికైనా అవెంజర్స్ తరహాలో సూపర్ పవర్ క్యారెక్టర్ చేయాలని ఉన్నట్లుగా తెలిపింది.

అయితే ఇదివరకే వచ్చిన పాత్రల తరహాలో కాకుండా సరి కొత్తగా ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా ఉండే ఒక సూపర్ పవర్ఫుల్ హీరోయిన్ పాత్రలో కనిపించాలని అనుకుంటున్నట్లు తాప్సీ వివరణ ఇచ్చింది.

అది పూర్తిగా ఇండియా నెటివిటి లకి తగ్గట్టుగా ఉండాలని ఎప్పుడు ఎవరు కూడా చేయని విధంగా ఉండాలి అని కూడా తాప్సి తెలియజేసింది. మరి తాప్సీ కోరికమేరకు ఎవరైనా అలాంటి క్యారెక్టర్ ను ఆమెకోసం సిద్ధం చేస్తారో లేదో చూడాలి. అలాగే తాప్సీ త్వరలోనే ఒక తెలుగు ప్రాజెక్ట్ లో కూడా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Tags:    

Similar News