నా పెళ్లి నా చేతిలోనే ఉందంటున్న స్టార్ హీరోయిన్

Update: 2020-05-11 17:30 GMT
తాప్సి.. టాలీవుడ్ లోకి 'ఝుమ్మంది నాదం' సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ సొట్టబుగ్గల సుందరి. టాలీవుడ్ లో చాలా హిట్ సినిమాలు చేసింది. మిస్టర్ పర్ఫెక్ట్, వీర, ఆనందో బ్రహ్మ, గంగ, నీవెవరో సినిమాలతో పాటు వెంకటేష్ లాంటి పెద్ద స్టార్స్ తో కూడా నటించింది. కానీ అమ్మడు తెలుగులో కంటే హిందీలోనే మంచి గుర్తింపు సాధించింది. 2010లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తాప్సి పదేళ్ల తర్వాత 'సాండ్ కి ఆంఖ్' అనే సినిమాకి తన మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. బాలీవుడ్ లో బిజీబిజీగా గడుపుతున్న కర్లీ హెయిర్ బ్యూటీ తన మ్యారేజ్ పై ఇటీవలే నోరువిప్పి ఓ క్లారిటి ఇచ్చింది. గత కొన్నేళ్లుగా డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో తాప్సీ లవ్ మ్యాటర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ విషయం గురించి తను ఎలాంటి సీక్రెట్స్ బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చింది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి పై స్పందించింది అమ్మడు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు అంటారు. నా పెళ్లి కూడా అంతే.. అని అనుకోకండి. నాకు చేసుకోవాలని అన్పించినప్పుడే చేసుకుంటాను అని షాక్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది.. అదేంటంటే నాకు పిల్లలు కావాలని ఎప్పుడు అన్పిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎలాగో దేశం మొత్తం తెలిసిపోయింది. ఆ విషయంలో దాచడానికి ఏం లేదు. అన్నట్లు నా బాయ్ ఫ్రెండ్ సినిమా ఫీల్డ్ లో లేదు, బిజినెస్ మ్యాన్ కాదు. టైం వచ్చినప్పుడు చెప్తా.. అప్పటివరకు నా పెళ్లి పై ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటుంది. కానీ అతనో బ్యాట్మింటన్ ప్లేయర్ అని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకుంది. ఇక గతంలో తాప్సికి తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం జరిగిందని వార్తలొచ్చాయి. కానీ అమ్మడు పెళ్లికి ఇంకా టైం ఉంది. కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొస్తుంది.
Tags:    

Similar News