అవును.. రేప్ విక్టిమ్ గా నటించాను

Update: 2016-08-14 11:30 GMT
ఇంతకీ ''పింక్'' సినిమాలో అసలు తాప్సీ పోషించిన పత్ర  ఏమిటి? ట్రైలర్ చూస్తే ఆమె డబ్బుకోసం మానన్ని అమ్ముకుంది అనే సందేహం వచ్చేలా ఇంటరెన్స్ గా తీశారు. అయితే తాను మోసం చేయబడ్డానని తాప్సీ వాదిస్తుంటుంది. రేపు భారతీయ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. అందాల భామ తాప్సీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.

''అర్దరాత్రి ఒంటరిగా నడవ గలుగుతుందో అప్పుడే స్త్రీలకు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు అని బాబూజీ అన్నారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? అత్యాచారాల బారి నుంచి బయట పడిన ప్పుడే మహిళలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన  రోజు. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలన్నారు'' అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఆమె పింక్ సినిమాలో ఒక రేప్ విక్టిమ్ గా నటిస్తోందట. ''ఆ పాత్రలో నటించినప్పుడు మానభంగానికి గురయ్యే మహిళలు ఎంత కష్టపడతారన్నది అర్ధమైంది. షూటింగ్‌ లో ఏడ్చేశాను. ఇది షూటింగే కదా అని యూనిట్ వర్గాలు సముదాయించాయి'' అని తెలిపింది తాప్సీ. అయితే ఈ సినిమా ద్వారా తాము చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటంటే.. ''మానభంగానికి గురైన యువతుల మనోవేదన అర్ధంచేసుకోవాలి'' అంటోంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో మాంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న తాప్సీ.. ఈ సినిమాతో పెద్ద హిట్టే కొట్టేలా ఉంది.

Tags:    

Similar News