#RRR అప్ డేట్స్ అంతకంతకు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా మరో ఐదారు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉంది. జూలై 30 డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ జక్కన్నలో టెన్షన్ అంత కంతకు రెట్టింపవుతోందట. ఇప్పటికే 70-80 శాతం చిత్రీకరణ పూర్తి చేసి పెండింగ్ పనుల్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. సైమల్టేనియస్ గా వీఎఫ్.ఎక్స్ సహా ఇతర కీలకమైన పనుల్ని పూర్తి చేస్తున్నారట.
ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తెల్లోళ్లను ఎదిరించే విప్లవ వీరులుగా ఆ ఇద్దరూ కనిపించనున్నారు. ముఖ్యంగా నైజాం గిరిజన యోధుడిగా తారక్ సరికొత్త ఆహార్యంతో ఆకట్టుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒకట్రెండు పోస్టర్లు తప్ప తారక్ కి సంబంధించి కానీ.. ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి కానీ ఏ లుక్ ని రాజమౌళి రిలీజ్ చేయనేలేదు. తారక్.. చరణ్ ఫుల్ లెంగ్త్ లుక్ ని రివీల్ చేయకుండా సస్పెన్స్ ని మెయింటెయిన్ చేయడంతో అభిమానుల్లో టెన్షన్ అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. మొన్న ఒకటో తారీఖున అయినా కొత్త సంవత్సరం ట్రీటిస్తాడనుకుంటే పెద్ద హ్యాండిచ్చాడు. దీనిపై ఫ్యాన్స్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
ఇక సాధ్యమైనంత తొందర్లోనే ఆర్.ఆర్.ఆర్ టైటిల్ సహా పాత్రలు పాత్రధారుల్ని పరిచయం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈలోగానే ఇందులో తారక్ పాత్ర గురించి ఓ ఆసక్తికర సమాచారం రివీలైంది. ఈ చిత్రంలో తారక్ జుత్తు లేకుండా గుండుతో కనిపిస్తాడన్నదే ట్విస్టు. అతడు గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు కాబట్టి అందుకు తగ్గట్టే షార్ట్ హెయిర్ కానీ గుండు కానీ కనిపిస్తుందట. అయితే ఇది నిజమా కాదా? అన్నది చిత్రబృందం చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఏడెనిమిది పాటలు ఉంటాయని తెలుస్తోంది. స్వతంత్ర పోరాట యోధుల పై దేశభక్తి గీతం.. రామ్ చరణ్ - ఆలియా .. ఎన్టీఆర్- ఒలీవియా మోరిస్ జంటల మధ్య రొమాంటిక్ గీతాలు ఆకట్టుకోనున్నాయట. సుద్దాల అశోక్ తేజ మూడు పాటలు రాసారు.