కుర్రాడే కాదు ఆ వాచ్ కూడా టూ స్మార్ట్

Update: 2021-12-29 05:35 GMT
స్మార్ట్ యుగం ఇది. ఇస్మార్ట్ కుర్రాళ్లంతా స్మార్ట్ వాచ్ లు స్మార్ట్ ఫోన్స్ తో గాడ్జెట్స్ తో కాల‌క్షేపం చేస్తున్నారు. అంతే ఇస్మార్ట్ గా స్టైలిష్ గా రెడీ అవుతున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ ప్ర‌చారంలో యంగ్ య‌మ ఎన్టీఆర్ కూడా ఇస్మార్ట్ లుక్ తో యువ‌ హృద‌యాల్ని దోచేస్తున్నారు.

చెన్నై ప్ర‌మోష‌న్స్ లో బిజీబిజీగా ఉన్న తార‌క రామారావు ఆర్.ఆర్.ఆర్ లోగోతో డిజైన్ చేసిన‌ అద్భుత‌మైన టీష‌ర్ట్ ని ధ‌రించాడు. బ్లాక్ జీన్స్ పై కాంబినేష‌న్ టీస్ ఎంతో ప‌ర్ఫెక్ట్ గా కుదిరింది. తార‌క్ హెయిర్ స్టైల్ .. స్మార్ట్ లుక్ ఫ్యాన్స్ లో ట్రెండీ టాపిక్ గా మారింది. ఇంట్రెస్టింగ్ గా స్మార్ట్ గా స్టైలిష్ గా క‌నిపిస్తున్న ఆ వాచ్ బ్రాండ్ ఏమిటో తెలుసుకోవాల‌ని యూత్ కుతూహాలంగా ఉన్నారు. మ‌రి తార‌క్ ఫ్యాన్స్ కి చెబుతారేమో చూడాలి.

ప్ర‌తిష్ఠాత్మ‌క ఆర్.ఆర్.ఆర్ చెన్నై స‌హా త‌మిళ‌నాడులో అత్యంత భారీగా విడుద‌ల కానుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే భారీగా బిజినెస్ సాగింది. వ‌సూళ్ల‌ను అంతే పెద్ద‌గా తెస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించే చిత్రంగా ప్ర‌చారం సాగుతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి- రామారావు- రామ్ చ‌ర‌ణ్ బృందాలు హిందీ స‌హా త‌మిళం మ‌ల‌యాళం క‌న్న‌డంలోనూ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీగా ఉన్నారు. 2022 జ‌న‌వ‌రి 7న ఈ సినిమా అత్యంత భారీగా విడుద‌ల కానుంది.
Tags:    

Similar News