హీరోగానే అవసరం లేదంటున్న తారకరత్న

Update: 2016-08-25 09:30 GMT
తాను హీరో వేషాలే వేయాలని మడికట్టుకుని కూర్చోలేదని అంటున్నాడు నందమూరి తారకరత్న. నటుడిగా నిరూపించుకోవడమే తన లక్ష్యమని.. అందుకే అన్ని రకాల పాత్రలూ వేస్తున్నానని అతను చెప్పాడు. తాను ముఖ్య పాత్ర పోషిస్తున్న ‘ఎవరు’ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో తారకరత్న ఇలా స్పందించాడు. ‘‘హీరోగానే కాక.. విలన్ పాత్రలూ చేస్తున్నాను. ఐతే హీరో అని కాదు.. విలన్ అని కాదు.. పాత్ర న‌చ్చితే ఏదైనా చేస్తాను. తార‌క‌ర‌త్న గుడ్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలి అంతే కానీ.. హీరోగానే చేయాలి.. విలన్ పాత్రలే ఎంచుకోవాలని ఆలోచించను. అందుకే సినిమాలు చేయ‌డం ఆలస్యమవుతున్నా డిఫరెంట్ గా ఉండే సబ్జెక్టులే ఎంచుకుంటున్నాను’’ అని తారకరత్న చెప్పాడు.

‘ఎవరు’ సినిమా గురించి చెబుతూ.. ‘‘చాలా వైవిధ్యంగా ఉండే హార్ర‌ర్ థిల్ల‌ర్ ఇది. క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ అయిన‌ప్ప‌టికీ చాలా సహజంగా ఉంటుంది. ఒక ఇంట్లోనే సినిమా అంతా జ‌రుగుతుంది. డైరెక్ట‌ర్ ర‌మ‌ణ సాల్వ ఈ చిత్రాన్ని అందరూ కొత్త‌వాళ్ల‌తో చేయాల‌నుకున్నారట‌. కానీ మా నిర్మాత అంకం చౌద‌రి గారు నాకీ కథ చెప్పడంతో కొత్తగా అనిపించి వెంట‌నే చేస్తానని చెప్పేశాను. హార్రర్ థ్రిల్లర్స్ గతంలో చాలా వచ్చినప్పటికీ మా సినిమా మాత్రం చాలా కొత్త‌గా ఉంటుంది. ర‌విబాబు త‌ర్వాత నా ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే ర‌మ‌ణ సాల్వ పేరే చెబుతాను. అంత‌లా త‌న పనితనంతో నన్ను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో నేను జ‌ర్న‌లిస్టుగా న‌టించాను. ఈ సినిమాకు ముందు యామిని చంద్రశేఖర్ అనే టైటిల్ పెట్టాం. ఇవి హీరో హీరోయిన్ల పాత్రలు. ఐతే ఆ పేరు పెడితే ఇది ఫీల్ గుడ్ ఫిల్మ్ అనుకుంటారని.. సబ్జెక్టుకు తగ్గట్లుగా ‘ఎవరు’ అని మార్చాం’’ అని తారకరత్న అన్నాడు.
Tags:    

Similar News