తార‌క్ కీల‌క నిర్ణ‌యం.. కొర‌టాల ప్రాజెక్ట్ మ‌రింత ఆల‌స్యం

Update: 2022-05-04 23:30 GMT
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ర‌చ‌యిత‌గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈయ‌న ప్ర‌భాస్ తో 'మిర్చి' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీని తెర‌కెక్కించి డైరెక్ట‌ర్ గా మారాడు. ఆ త‌ర్వాత ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంలో టాలీవుడ్‌లో అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా కొర‌టాల ముంద్ర వేయించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈయ‌న తాజా చిత్ర‌మైన 'ఆచార్య‌' కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు.

కానీ, అంద‌రి ఊహ‌ల‌కు భిన్నంగా ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. దీంతో కొరటాల శివ‌కు తొలిసారి ఆచార్య రూపంలో బిగ్ ఫ్లాప్ ఎదురైంది. కొర‌టాల నుంచి ఇటువంటి సినిమా అస్సలు ఊహించ‌లేద‌ని నెటిజ‌న్లు ఆయ‌న‌పై ట్రోల్స్ కూడా చేశారు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. కొర‌టాల త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది వేస‌విలో ఈ మూవీని అనౌన్స్ చేశారు.

కల్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నారు.  'ఎన్టీఆర్ 30' వ‌ర్కింగ్ టైటిల్ తో త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఆచార్య ప్ర‌భావం ఎంతో కొంత ప‌డే అవ‌కాశాలు ఖ‌చ్చితంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే తార‌క్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

ఆచార్య ఫలితం నుంచి కోలుకోవడానికి కొరటాల శివను బ్రేక్ తీసుకోమని ఎన్టీఆర్ సూచించార‌ట‌. అలాగే స్క్రిప్ట్ మీద మరోసారి వర్క్ చేయమని కొర‌టాల‌కు గ‌ట్టిగా చెప్పార‌ట‌. వాస్త‌వానికి 'ఎన్టీఆర్ 30 ' స్టోరీ లైన్, స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయింది.

జూన్ నుంచి షూటింగ్ ను కూడా షురూ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. కానీ, ఆచార్య రిజ‌ల్ట్ నేప‌థ్యంలో రీస్క్ తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఎన్టీఆర్.. స్టోరీ లైన్ మ‌రియు స్క్రిప్ట్ పై మ‌రోసారి కూర్చోమని కొర‌టాల‌కు స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు టాక్‌ న‌డుస్తోంది.

దీంతో ఎన్టీఆర్‌-కొర‌టాల ప్రాజెక్ట్ మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని, మ‌రో మూడు, నాలుగు నెల‌ల వ‌ర‌కు ఈ మూవీ ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు లేన‌ట్టే అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం నిజ‌మో.. కాదో.. తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News