ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న `సాహో` ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజులే సమయం మిగిలి ఉంది. డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 290 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసిందని తెలుస్తోంది. అందులో హిందీ రైట్స్ ని టీసిరీస్ 80 కోట్లకు దక్కించుకుంది. అంటే ఆ మేరకు షేర్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అయితే ఉత్తరాది ఆడియెన్ నుంచి `సాహో` 2019 బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు 50 కోట్లు .. మలి రెండ్రోజులు మరో 100 కోట్లు వసూలు చేస్తుందన్న అంచనా వెలువరిస్తున్నారు ట్రేడ్ పండితులు. అందుకు తగ్గట్టే థియేటర్లను అత్యంత భారీగా సిద్ధం చేశారని తెలుస్తోంది.
అయితే సాహో 2019 బెస్ట్ కావాలంటే.. హిందీ పరిశ్రమలో ఈ ఏడాది ఘనవిజయాలు సాధించిన 10 సినిమాల రికార్డుల్ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో సినిమా రికార్డును బ్రేక్ చేస్తూ చివరికి మన తెలుగు దర్శకుడే తెరకెక్కించిన `కబీర్ సింగ్` రికార్డును కొట్టేస్తే నంబర్ వన్ అయినట్టే. షాహిద్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన కబీర్ సింగ్ 279 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ నంబర్ వన్ (ఇప్పటికి) చిత్రంగా నిలిచింది. ఆ రికార్డును సాహో బ్రేక్ చేస్తే 2019 నంబర్ వన్ గా రికార్డులకెక్కినట్టే. కబీర్ సింగ్ తర్వాత యూరి చిత్రం రూ.235 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ఉంది.
ఈ ఏడాది హిందీలో టాప్ 10 చిత్రాల్ని పరిశీలిస్తే.. కబీర్ సింగ్- యూరి- భారత్- మిషన్ మంగళ్-కేసరి- టోటల్ ధమాల్- సూపర్ 30- గల్లీ బోయ్- దేదే ప్యార్ దే- మణికర్ణిక చిత్రాలు క్యూలో ఉన్నాయి. కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన కేసరి- మిషన్ మంగళ్ టాప్ 5లో నిలవడం విశేషం. ఇందులో సల్మాన్ నటించిన భారత్ ఉంది. అంటే `సాహో` హిందీ పరిశ్రమ నుంచి జస్ట్ 300 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే చాలు ఖాన్ ..కపూర్ .. కిలాడీల్ని వెనక్కి నెట్టేసినట్టే.