వేరే సినిమాలు వేటి గురించీ రివ్యూ చేయడం అలవాటు లేదంటూనే ‘క్షణం’ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు అల్లు అర్జున్. ఇంకా చాలామంది సెలబ్రెటీలు ఈ సినిమాను పొగుడుతూ ట్వీట్లు కురిపించారు. ఐతే మన సినిమాను మనోళ్లు పొగడ్డం కంటే.. పరాయి భాషలకు చెందిన వాళ్లు కీర్తిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ‘క్షణం’ టీమ్ ఇప్పుడు ఆ కిక్కునే ఆస్వాదిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘క్షణం’ సినిమాను ఓ రేంజిలో పొగిడేశాడు.
‘క్షణం’ సినిమా గురించి బాలీవుడ్ సైతం ఆరాలు తీస్తున్న నేపథ్యంలో పీవీపీ సంస్థ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని బాలీవుడ్ సెలబ్రెటీల కోసం స్పెషల్ షో ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెడీ చేసిపెట్టుకున్నారా.. లేక అప్పటికప్పుడు కంటెంట్ రెడీ అయిందా అన్నది తెలియదు కానీ.. ఈ షోకు సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేశారు. ఈ స్పెషల్ షో వీక్షించిన వాళ్లలో తరణ్ ఆదర్శ్ కూడా ఒకడు. షో పూర్తవడం ఆలస్యం.. ఈ సినిమాను పొగుడుతూ ట్వీట్లు గుప్పించాడు తరణ్.
‘‘కొన్ని సినిమాలు మన మీద గొప్ప ఇంపాక్ట్ చూపిస్తాయి. క్షణం (తెలుగు) అద్భుతమైన సినిమా. ప్రతి విభాగమూ గొప్పగా పని చేసింది. డైరెక్టర్ రవికాంత్ పేరెపు, రైటర్ అడివి శేష్.. టెంప్లేట్ థ్రిల్లర్స్ కు భిన్నంగా ‘క్షణం’ ను తీర్చిదిద్దారు. ఊహకందని ట్విస్టులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. క్షణం సినిమాకు యూనివర్శల్ లాంగ్వేజ్ ఉంది. మీకు ఉత్కంఠ రేపే థ్రిల్లర్లు నచ్చేట్లయితే.. క్షణం తప్పక చూడాల్సిన జాబితాలో ఉంటుంది’’ అని తీర్పిచ్చాడు తరణ్. ‘క్షణం’ టీంకు ఇంతకంటే మంచి గుర్తింపు ఏముంటుంది చెప్పండి.